మళ్లీ మైదానంలోకి ధావన్, హర్భజన్‌

Published on Tue, 11/25/2025 - 08:14

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్లు శిఖర్‌ ధావన్, హర్భజన్‌ సింగ్‌ సహా పలువురు దిగ్గజ ఆటగాళ్లు లెజెండ్స్‌ ప్రొ టి20 లీగ్‌ బరిలోకి దిగనున్నారు. గోవా వేదికగా వచ్చే ఏడాది జనవరి 26 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఈ లీగ్‌ జరగనుంది. భారత మాజీ ఆటగాళ్లతో పాటు పలువురు అంతర్జాతీయ దిగ్గజాలు సైతం ఈ లీగ్‌లో భాగస్వాములు కానున్నారు. దక్షిణాఫ్రికా పేస్‌ గన్‌ డేల్‌ స్టెయిన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ ఈ జాబితాలో ఉన్నారు. ఆ్రస్టేలియా మాజీ కెపె్టన్‌ మైకేల్‌ క్లార్క్‌ లీగ్‌ కమిషనర్‌గా వ్యవహరించనున్నట్లు నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఎస్‌జీ గ్రూప్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ లీగ్‌లో మొత్తం 6 ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. అన్నీ జట్లలో కలిపి 90 మంది లెజండరీ ప్లేయర్లు పాల్గొననున్నారు. ‘క్రికెట్‌కు అతిపెద్ద నిలయంగా ఉన్న భారతదేశం నాకు ప్రత్యేక స్థానాన్ని ఇచి్చంది. ఈ లీగ్‌లో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నా. ఇక్కడి అభిమానులకు ఆటపై అభిరుచి ఎక్కువ. ఈ లీగ్‌ ద్వారా పలువురు పాత మిత్రులతో పాటు, గతంలో హోరాహోరీగా తలపడిన ప్రత్యర్థులను తిరిగి కలిసే అవకాశం లభించనుంది. లెజెండ్స్‌ ప్రొ టి20 లీగ్‌లో కొత్త పాత్రలో భాగం కావడం సంతోషంగా ఉంది’ అని క్లార్క్‌ పేర్కొన్నాడు.   

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)