Breaking News

బంగ్లాదేశ్‌ జట్టుకు భారీ షాక్‌

Published on Thu, 06/04/2026 - 15:38

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు పేస్ బౌలింగ్ కోచ్, ఆసీస్‌ మాజీ స్పీడ్‌స్టర్‌ షాన్‌ టైట్‌ తన పదవికి రాజీనామా చేసినట్లు ధృవీకరించాడు. 2025 మేలో బాధ్యతలు చేపట్టిన టైట్, 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఒప్పందం ఉన్నప్పటికీ మధ్యలోనే తప్పుకోవడం చర్చనీయాంశమైంది. టైట్‌ శిక్షణలో యువ పేసర్ నహిద్‌ రాణా విశేషంగా రాణించాడు. అతడి వేగం, ప్రదర్శన మెరుగుపడటంలో టైట్ పాత్ర కీలకమని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

టైట్‌ కీలక సమయంలో బంగ్లాదేశ్‌ జట్టును దెబ్బేశాడు. జూన్‌ 9 నుంచి 21 వరకు ఆస్ట్రేలియా జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌ పర్యటించనుంది. ఈ సిరీస్‌కు కొద్ది రోజుల ముందు టైట్‌ హ్యాండ్‌ ఇవ్వడం​ బంగ్లాదేశ్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బగా పరిగణించాలి. ఈ సమయంలో బంగ్లా పేసర్లకు టైట్‌ శిక్షణ (ఆసీస్‌ బ్యాటర్లను కట్టడి చేసేందుకు) చాలా ముఖ్యం. 

అలాంటిది కారణం ఏంటో చెప్పకుండా టైట్‌ అర్దంతరంగా బంగ్లా జట్టుకు హ్యాండ్‌ ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తుంది. టైట్‌ స్థానంలో మాజీ బంగ్లా పేసర్ తల్హా జుబైర్‌ను తాత్కాలిక పేస్ బౌలింగ్ కోచ్‌గా నియమించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

కాగా, 3 మ్యాచ్‌ల వన్డే‌, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. జూన్‌ 9 నుంచి మొదలుకానున్న ఈ పర్యటనలో తొలుత వన్డేలు, ఆతర్వాత టీ20లు జరుగనున్నాయి. వన్డేలు జూన్‌ 9, 11, 14 తేదీల్లో ఢాకాలోని షేరే బంగ్లా స్టేడియంలో జరుగనుండగా.. మూడు టీ20లు జూన్‌ 17, 19, 21 తేదీల్లో చట్టోగ్రామ్‌లో జరుగనున్నాయి.

ఈ సిరీస్‌ల కోసం వేర్వేరు ఆస్ట్రేలియా జట్లను ఇదివరకే ప్రకటించగా.. తొలి రెండు వన్డేల కోసం బంగ్లాదేశ్‌ జట్టును నిన్ననే ప్రకటించారు.

ఆస్ట్రేలియా వన్డే జట్టు..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కానలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కునెమాన్, మార్నస్ లాబుషేన్, మాథ్యూ రెన్‌షా, తన్వీర్ సంఘా, లియామ్ స్కాట్, ఆడమ్ జంపా

ఆస్ట్రేలియా టీ20 జట్టు..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కానలీ, టిమ్ డేవిడ్, జోయెల్ డేవిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాథ్యూ కుహ్నెమాన్, రిలే మెరెడిత్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్‌షా, ఆడమ్ జంపా

తొలి రెండు వన్డేలకు బంగ్లాదేశ్‌ జట్టు..
మెహిది హసన్ మిరాజ్ (కెప్టెన్), సౌమ్య సర్కార్, సైఫ్ హసన్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, లిట్టన్ దాస్, మొసద్దెక్ హొస్సేన్, నూరుల్ హసన్ సోహన్, రిషద్ హుస్సేన్, తన్వీర్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్‌, తస్కిన్‌ అహ్మద్‌, షొరీఫుల్‌ ఇస్లాం, నహిద్‌ రాణా

 

 

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)