Breaking News

‘గోట్‌ టూర్‌’ చీఫ్‌ ఆర్గనైజర్‌ జైలుకు!

Published on Mon, 12/15/2025 - 02:41

కోల్‌కతా: అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లయోనల్‌ మెస్సీ ప్రస్తుతం ‘గోట్‌ (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌) టూర్‌ ఆఫ్‌ ఇండియా’లో భాగంగా భారత్‌లో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నాడు. ఈ టూర్‌ ముఖ్య నిర్వాహకుడు శతద్రు దత్తా కాగా... తొలిరోజు కోల్‌కతాలో ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన కోల్‌కతా పోలీసులు జైలుకు తరలించారు. 

కొన్నిరోజులుగా సాల్ట్‌లేక్‌ స్టేడియంలో మెస్సీ మ్యాచ్‌ ఆడతాడంటూ ప్రముఖంగా ప్రచారం చేశారు. రూ. వేలల్లో టికెట్లను అమ్మారు. ఫుట్‌బాల్‌ క్రేజీ బెంగాలీ వాసులు సుమారు 80 వేల మంది వేలకువేలు వెచి్చంచి స్టేడియానికి తరలివెళ్లారు. కానీ తమ ఆరాధ్య ఫుట్‌బాలర్‌ మెస్సీ పట్టుమని పది నిమిషాలైనా మైదానంలో అలరించలేదు. 

ఆ ఉన్న కొద్దిసేపు కూడా చీమలదండు లాంటి భద్రతా వలయంతో ఏ గ్యాలరీలోని ప్రేక్షకుడు కూడా మెస్సీని చూడలేకపోయాడు. దీంతో సూపర్‌స్టార్‌ను ప్రత్యక్షంగా చూసి కన్నుల పండగ చేసుకుందామని రూ.వేలు వెచి్చంచిన అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా వేల మంది విరుచుకుపడటంతో కరతాళ ధ్వనులతో మార్మోగాల్సిన మైదానం రసాభాసగా మారింది. 

ఈ ఈవెంట్‌ నిర్వహణ వైఫల్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అభిమానుల తాకిడి, అంచనాలకు విరుద్ధంగా ఏర్పాట్లు, నిర్వహణ వైఫల్యంపై చీఫ్‌ ఆర్గనైజర్‌ శతద్రు దత్తాను శనివారమే అదుపులోకి తీసుకొని ఆదివారం జడ్జి ముందు హాజరు పరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి... ముఖ్య నిర్వాహకుడికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో శతద్రును జైలుకు తరలించారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)