Breaking News

IND Vs SA: దక్షిణాఫ్రికా బౌలర్‌ రాకాసి బౌన్సర్.. శార్దూల్‌కు తప్పిన ప్రమాదం

Published on Tue, 12/26/2023 - 21:19

సెంచూరియన్‌ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి రోజు ఆటముగిసింది. మొదటి రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో సఫారీ పేసర్లు భారత బ్యాటర్లకు చుక్కలు చూపించారు. నిప్పులు చెరిగే బంతులను సంధించారు. ఈ క్రమంలో టీమిండియా బౌలింగ్‌ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు పెను ప్రమాదం తప్పింది.

ఏమి జరిగిందంటే?
భారత తొలి ఇన్నింగ్స్‌ 44 ఓవర్‌లో మూడో బంతిని గంటకు 148 కిలోమీటర్ల వేగంతో ప్రోటీస్‌ యువ పేసర్‌ కోయిట్జీ బౌన్సర్‌గా సంధించాడు. శార్ధూల్‌ ఆ బంతిని ఫుల్ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతిని అంచనా వేయడంలో శార్ధూల్‌ విఫలమయ్యాడు. దీంతో బంతి బ్యాట్‌కు మిస్స్‌ అయ్యి అతడి హెల్మెట్‌కు బలంగా తాకింది. ఠాకూర్ నుదిటిపై వాపు వచ్చింది. మైదానంలో నొప్పితో విల్లావిల్లాడు.

వెంటనే ఫిజియో వచ్చి కంకషన్ టెస్టు చేశాడు. ఆ తర్వాత శార్దూల్ మళ్లీ బ్యాటింగ్ ప్రారంభించాడు. రబాడ వేసిన ఓవర్‌లో మళ్లీ బంతి శార్ధూల్‌ చేతికి తగిలింది. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు.  అయితే దెబ్బ తగిలిన తర్వాతి బంతికే శార్దూల్ (33 బంతుల్లో 24) ఔటయ్యాడు.
చదవండి: IND vs SA 1st Test: టీమిండియాతో తొలి టెస్టు.. దక్షిణాఫ్రికాకు బిగ్‌ షాక్‌

Videos

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)