Breaking News

మోహిత్‌ శర్మ స్టన్నింగ్‌ క్యాచ్‌.. ప్రయోగం బెడిసికొట్టింది

Published on Sat, 04/29/2023 - 17:42

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్‌ ప్రయోగం వికటించింది. ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్‌ కల్పించి పించ్‌ హిట్టర్‌గా మూడో స్థానంలో పంపితే అతను మాత్రం డకౌట్‌ అయ్యాడు. షమీ బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ నాలుగో బంతిని భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో మోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

అయితే ఇక్కడ మోహిత్‌ క్యాచ్‌ హైలెట్‌గా నిలిచింది. మిడాన్‌ నుంచి వెనక్కి పరిగెత్తిన మోహిత్‌ శరీరాన్ని విల్లులా ఒంపి డైవ్‌ చేస్తూ అద్భుతంగా క్యాచ్‌ తీసుకున్నాడు.  దీంతో శార్దూల్‌ కథ ముగిసింది. అంతకముందే మోహిత్‌ ఎడమచేతి వేలికి గాయమైంది. ఐస్‌ ప్యాక్‌ పెట్టుకొని ఫీల్డింగ్‌ చేశాడు. గాయాన్ని సైతం లెక్కచేయకుండా స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిశాడు.

శార్దూల్‌కు కలిసి రాని ప్రమోషన్‌
ఇక శార్దూల్‌ ఠాకూర్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్‌ ఇచ్చిన ప్రతీసారి అతనికి కలిసిరాలేదని చెప్పొచ్చు. తన టి20 కెరీర్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌ రావడం శార్దూల్‌కు ఇదే తొలిసారి. ఇంతకముందు 2021 ఐపీఎల్‌లో క్వాలిఫయర్‌లో భాగంగా సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఢిల్లీ తరపున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పుడు గోల్డెన్‌ డకౌట్‌ అయిన శార్దూల్‌ తాజాగా గుజరాత్‌తో మ్యాచ్‌లో పించ్‌ హిట్టర్‌గా వచ్చి(మూడోస్థానంలో) డకౌట్‌గా వెనుదిరిగాడు.

చదవండి: ట్రాక్‌లో పడాలంటే ఆలు పరోటాలు చేయాల్సిందేనా!

Videos

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)