Breaking News

పాక్ కెప్టెన్ సూప‌ర్ సెంచ‌రీ.. నాలుగేళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌

Published on Mon, 10/07/2024 - 14:28

ముల్తాన్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ షాన్ మ‌సూద్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో క్రీజులోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే ఇంగ్లీష్ బౌల‌ర్ల‌పై షాన్‌ విరుచుకుప‌డ్డాడు. వ‌న్డే త‌ర‌హాలో దూకుడుగా ఆడుతున్న మ‌సూద్ కేవ‌లం 102 బంతుల్లోనే త‌న సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు.

అత‌డి ఇన్నింగ్స్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 10 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ప్ర‌స్తుతం 104 ప‌రుగుల‌తో మ‌సూద్ బ్యాటింగ్ చేస్తున్నాడు. కాగా మ‌సూద్‌కు ఇది ఐదో టెస్టు సెంచ‌రీ. అయితే అత‌డికి నాలుగేళ్ల త‌ర్వాత ఇదే తొలి టెస్టు సెంచ‌రీ కావ‌డం గ‌మ‌నార్హం. మ‌సూద్ చివ‌ర‌గా 2020లో మాంచెస్ట‌ర్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన టెస్టులో శ‌త‌కం సాధించాడు.

అంతేకాకుండా 2022 ఏడాది త‌ర్వాత ఓ పాక్ కెప్టెన్ టెస్టుల్లో సెంచ‌రీ చేయ‌డం ఇదే మొద‌టి సారి. 2022 డిసెంబ‌ర్‌లో పాకిస్తాన్ కెప్టెన్‌గా ఉన్న బాబ‌ర్ ఆజం.. కివీస్‌తో జ‌రిగిన టెస్టులో సెంచ‌రీ చేశాడు. ఇప్పుడు మ‌ళ్లీ రెండేళ్ల త‌ర్వాత మ‌సూద్ సెంచ‌రీతో మెరిశాడు. ఇక 39 ఓవ‌ర్లు ముగిసే స‌రికి పాక్ వికెట్ న‌ష్టానికి 184 ప‌రుగులు చేసింది. క్రీజులో మ‌సూద్‌తో పాటు ష‌ఫీక్‌(72) ప‌రుగుల‌తో ఉన్నాడు.
చదవండి: టీమిండియా అరుదైన ఘనత.. పాకిస్తాన్‌ వరల్డ్‌ రికార్డు సమం
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)