Breaking News

చరిత్ర సృష్టించిన షకీబ్.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ఆటగాడిగా..!

Published on Sun, 05/26/2024 - 12:05

బంగ్లాదేశ్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లలో) 14000 పరుగులు చేయడంతో పాటు 700 వికెట్లు పడగొట్టిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. యూఎస్‌ఏతో నిన్న (మే 25) జరిగిన టీ20లో ఆండ్రియస్‌ గౌస్‌ వికెట్‌ పడగొట్టడం ద్వారా షకీబ్‌ 700 అంతర్జాతీయ వికెట్ల మైలురాయిని తాకాడు. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌లో 14000 పరుగుల మైలురాయిని తాకిన షకీబ్‌.. తాజాగా 700 వికెట్ల క్లబ్‌లో చేరిన 17వ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం యూఎస్‌ఏలో పర్యటిస్తుంది. ఈ జట్టుకు ఆతిథ్య దేశం, క్రికెట్‌ పసికూన అయిన యూఎస్‌ఏ నుంచి ఊహించని పరాభవం ఎదురైంది. ఈ సిరీస్‌ను యూఎస్‌ఏ 2-1 తేడాతో కైవసం చేసుకుని బంగ్లా పులులకు ఊహించని షాకిచ్చింది. నిన్న జరిగిన మూడో టీ20లో గెలుపొంది బంగ్లాదేశ్‌ క్లీన్‌ స్వీప్‌ పరాభవం నుంచి తప్పించుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో ముస్తాఫిజుర్‌ ఆరు వికెట్లతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఎస్‌ఏ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 104 పరుగులు మాత్రమే చేయగలిగింది.

అనంతరం 105 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. ఓపెనర్లు తంజిద్‌ (42 బంతుల్లో 58 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), సౌమ్య సర్కార్‌ (28 బంతుల్లో 43 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో 11.4 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది.

 

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)