Breaking News

వెస్టిండీస్‌ కెప్టెన్‌ విధ్వంసకర సెంచరీ.. 9 ఫోర్లు, 8 సిక్స్‌లతో! వీడియో వైరల్‌

Published on Mon, 09/18/2023 - 13:25

కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2023లో వెస్టిండీస్‌ వన్డే కెప్టెన్‌, గయానా అమెజాన్ వారియర్స్ స్టార్‌ బ్యాటర్‌ షాయ్ హోప్‌ విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం ఉదయం  బార్బడోస్ రాయల్స్‌, గయానా అమెజాన్ వారియర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో గయానా బ్యాటర్‌ షాయ్ హోప్‌ మెరుపు సెంచరీతో చెలరేగాడు.

కేవలం 41 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను హోప్‌ అందుకున్నాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లను హోప్ ఊచకోత కోశాడు. ముఖ్యంగా గయానా ఇన్నింగ్స్‌లో 10 ఓవర్‌ వేసిన  రహ్కీమ్ కార్న్‌వాల్‌ బౌలింగ్‌లో హోప్‌ ఆకాశమే హద్దుగా చేలరేగిపోయాడు. ఆ ఓవర్‌లో 4 సిక్స్‌లు, రెండు ఫోర్లతో ఏకంగా 32 పరుగులు రాబట్టాడు.

ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో హోప్‌ 9ఫోర్లు, 8 సిక్స్‌లతో 106 పరుగులు చేశాడు. హోప్‌ అద్బుత సెంచరీ ఫలితంగా గయానా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బార్బడోస్ రాయల్స్‌ 6 వికెట్లు కోల్పోయి 138 పరుగులకే పరిమితమైంది.

దీంతో 88 పరుగుల తేడాతో  గయానా అమెజాన్ వారియర్స్ ఘన విజయం సాధించింది.  బార్బడోస్ రాయల్స్‌ బ్యాటర్లలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ క్లార్క్‌(54) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  గయానా బౌలర్లలో కెప్టెన్‌ ఇమ్రాన్‌ తహీర్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. మోటీ రెండు వికెట్లు సాధించాడు.
చదవండి: నాకు ఒక మెసేజ్‌ వచ్చింది.. అందుకే సిరాజ్‌కు మళ్లీ బౌలింగ్‌ ఇవ్వలేదు: రోహిత్‌ శర్మ

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)