‘అల్లుడు’ నీ పరుగులేం అక్కర్లేదు.. పాక్‌ ప్లేయర్‌పై అఫ్రిది ఫైర్‌

Published on Tue, 09/16/2025 - 14:01

ఆసియాక‌ప్‌-2025లో దుబాయ్ వేదిక‌గా ఆదివారం భార‌త్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘోర ప‌రాజయం పాలైంది. అయితే ప్ర‌స్తుతం అంతా  పాక్ చెత్త ప్ర‌ద‌ర్శ‌న గురించి కాకుండా ఈ మ్యాచ్ అనంత‌రం చెలరేగిన హ్యాండ్ షేక్ వివాదం గురించే చర్చించుకుంటున్నారు.

కానీ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మాత్రం తమ జట్టు చెత్త ఆటను మర్చిపోలేదు. తాజాగా ఓ టీవీ ఛానల్ డిబేట్‌లో పాల్గోన్న అఫ్రిది.. తన అల్లుడు షాహీన్ షా అఫ్రిదిని విమర్శించాడు. షాహీన్ షా అఫ్రిది బౌలిం‍గ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.

అఫ్రిది బౌలింగ్‌ను భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఉతికారేశాడు. కానీ బ్యాటింగ్‌లో మాత్రం అఫ్రిది మెరుపులు మెరిపించాడు. కేవలం 16 బంతుల్లో 33 పరుగులు చేసి పాక్ స్కోర్ 100 పరుగుల మార్కు దాటడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే షాహీన్ బ్యాట్‌తో కాకుండా బంతితో రాణించి ఉంటే బాగుండేదని షాహిద్ అఫ్రిది అన్నాడు.

"షాహీన్ బ్యాటింగ్‌లో కొన్ని పరుగులు చేశాడు. అతడి ఆడిన ఇన్నింగ్స్ ఫలితంగానే మా జట్టు స్కోర్ 100 పరుగులు దాటింది. అందుకు అతడికి ధన్యవాదాలు. కానీ  షాహీన్ నుంచి  నేను ఆశించింది పరుగులు కాదు. అతడు నుంచి మంచి బౌలింగ్ కావాలి. అలాగే అయుబ్‌ నుంచి నేను బౌలింగ్‌ను కోరుకోను.

అతడు పరుగులు చేయాలి. జట్టులో అతడి పాత్ర ఎంటో షాహీన్ ఆర్ధం చేసుకోవాలి. కొత్త బంతిని స్వింగ్ చేసి, వికెట్లు సాధించేందుకు మార్గాలను అన్వేషించాలి. అతను తన గేమ్ ప్లాన్‌పై దృష్టి సారించాలి" అని సామా టీవీ ఇంటర్వ్యూలో అఫ్రిది పేర్కొన్నాడు

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)