Breaking News

వరల్డ్‌కప్‌ ఫైనల్లో టీమిండియా ఓటమి.. షాహీన్‌ షా అఫ్రిది పోస్ట్‌ వైరల్‌

Published on Mon, 11/20/2023 - 19:52

వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో భారత్‌ ఓటమి చవిచూసింది. దీంతో ఆరోసారి ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌గా అవతరించగా.. భారత్‌ మరోసారి రన్నరప్‌గా నిలిచింది. ఇక ఛాంపియన్స్‌గా నిలిచిన ఆస్ట్రేలియాకు పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిది అభినందనలు తెలిపాడు.

"వన్డే ప్రపంచకప్‌-2023 విజేతగా నిలిచిన ఆస్ట్రేలియాకు నా అభినందనలు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శరన కనబరిచింది. టీమిండియాకు అదృష్టం కలిసిరాలేదు. కానీ టోర్నీ మొత్తం భారత్‌ అద్భుతంగా ఆడింది" అని ట్విటర్‌లో అఫ్రిది పోస్ట్‌ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లోనూ విఫలమైంది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 240 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి(54), కేఎల్‌ రాహుల్‌(66) పరుగులు చేశారు. అనంతరం 241 పరుగుల లక్ష్యాన్ని 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్‌ విజేతగా నిలవడంలో ట్రావిడ్‌ హెడ్‌ కీలక పాత్ర పోషించాడు. హెడ్‌ అద్బుతమైన సెంచరీతో (120 బంతుల్లో 137 పరుగులు) ఆరోసారి తన జట్టును ఛాంపియన్స్‌గా నిలిపాడు.
చదవండి: AUS vs PAK: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌.. పాక్‌ జట్టు ప్రకటన! యువ సంచలనం ఎంట్రీ

Videos

దేశాన్ని రక్షించడానికి నా సిందూరాన్ని పంపుతున్నా

26 చోట్ల డ్రోన్లతో పాక్ దాడులు.. నేలమట్టం చేసిన భారత సైన్యం

ప్రజలకు ఇవ్వాల్సింది పోయి వారి దగ్గర నుంచే దోచుకుంటున్నారు: Karumuri Nageswara

గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్

సీమ రాజాకు ఇక చుక్కలే. .. అంబటి సంచలన నిర్ణయం

నడిరోడ్డుపై ఒక మహిళను.. వీళ్లు పోలీసులేనా..!

ఎప్పుడు పిలిచినా యుద్ధానికి రెడీ

S400 చూసి వణికిపోతున్న పాక్ ఫేక్ ప్రచారంతో శునకానందం

మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసుల దౌర్జన్యం

బగ్లీహార్, సలాల్ డ్యామ్స్ గేట్లు తెరిచిన ఇండియా

Photos

+5

లండన్ లో రామ్ చరణ్.. చుట్టుముట్టిన మెగాఫ్యాన్స్ (ఫొటోలు)

+5

పాకిస్తాన్‌తో పోరులో దేశ సేవకు అమరుడైన మురళీ నాయక్‌ (ఫొటోలు)

+5

‘#సింగిల్‌’ మూవీ సక్సెస్ మీట్‌ (ఫొటోలు)

+5

అత్యంత వైభవంగా తిరుపతి గంగమ్మ తల్లి జాతర (ఫొటోలు)

+5

హైదరాబాద్ : మిస్‌ వరల్డ్‌ పోటీలకు అంతా సిద్ధం (ఫొటోలు)

+5

HIT3 సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భారత సైన్యానికి మద్దతుగా.. (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ + వెస్ట్రన్‌... లాపతా లేడీ సరికొత్త స్లైల్‌ (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో ఒకప్పటి హీరోయిన్ మీనా సందడి (ఫొటోలు)

+5

హీరోయిన్ సోనమ్ కపూర్ పెళ్లి రోజు.. భర్తతో ఇలా (ఫొటోలు)