Breaking News

అలాంటి ఇన్నింగ్స్‌ నా కెరీర్‌లో చూడలేదు: షాహీన్‌ షా అఫ్రిది

Published on Wed, 08/21/2024 - 15:09

టీమిండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ స్టార్ పేస‌ర్ షాహీన్ షా అఫ్రిది ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. టీ20 ప్రపంచకప్ 2022లో మెల్‌బోర్న్ వేదిక‌గా పాక్‌పై విరాట్ కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌ను అఫ్రిది కొనియాడాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో త‌ను చూసిన అత్యుత్త‌మ ఇన్నింగ్స్ కోహ్లిదే అని ఈ పాక్ స్పీడ్ స్టార్ చెప్పుకొచ్చాడు. "విరాట్ కోహ్లి ఒక అద్భుత‌మైన ఆట‌గాడు. మాపై కోహ్లి (58 బంతుల్లో 82 నాటౌట్) ఆడిన‌ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్న త‌క్కువే. 

నా కెరీర్‌లోనే ఇప్ప‌టివ‌ర‌కు ఇంత‌కంటే అత్యుత్త‌మ ఇన్నింగ్స్‌ను చూడ‌లేదు. ఆ రోజు హ్యారీస్ ర‌వూఫ్ వేసిన అద్భుత‌మైన బంతిని కోహ్లి బౌల‌ర్ త‌ల‌పై నుంచి కొట్టిన సిక్స్ నమ్మశక్యం కానిది" అంటూ స్టార్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అఫ్రిది పేర్కొన్నాడు.

వ‌న్ మ్యాన్ కింగ్‌ షో..
కాగా కోహ్లి కెరీర్‌లో మెల్‌బోర్న్‌లో పాక్‌పై ఆడిన ఇన్నింగ్స్ చిరస్మ‌ర‌ణీయంగా మిగిలుపోతుంద‌ని అన‌డంలో ఎటువంటి సందేహం లేదు. టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్తాన్‌తో జ‌రిగిన లీగ్ మ్యాచ్‌లో భార‌త్‌కు అద్బుత‌మైన విజ‌యాన్ని అందించాడు కింగ్ కోహ్లి. 160 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా . 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ప‌డింది.

 ఈ క్ర‌మంలో విరాట్ త‌న అద్భుత ఇన్నింగ్స్‌తో భార‌త్‌ను విజ‌య‌తీరాల‌కు చేర్చాడు.  హ్యారీస్ ర‌వూఫ్ వేసిన 19వ ఓవర్‌లో చివరి రెండు బంతులకు విరాట్ కొట్టిన సిక్స్‌లు క్రికెట్ చరిత్ర‌లో అత్యుత్త‌మంగా నిలిచిపోయాయి. ఆ మ్యాచ్‌లో 53 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 6 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 82 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)