Breaking News

షాహీన్‌ అఫ్రిది 'నిఖా' హోగయా.. ప్రత్యేక అతిధి ఎవరంటే..?

Published on Fri, 02/03/2023 - 15:42

పాకిస్తాన్‌ యువ పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిది వివాహం ఇవాళ (ఫిబ్రవరి 3) పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో షాహీన్‌.. పాక్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది కుమార్తె అన్షాను నిఖా చేసుకున్నాడు. ఈ వివాహ కార్యక్రమానికి పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ ప్రత్యేక అతిధిగా హాజరయ్యాడు. షాహీన్‌-అన్షా జంటకు పాక్‌ సహచర క్రికెటర్లు, అలాగే షాహీన్‌ పీఎస్‌ఎల్‌ (పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌) జట్టు లాహోర్‌ ఖలందర్స్‌ జట్టు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

షాహీన్‌ను అత్యంత సన్నిహితులైన పాక్‌ క్రికెటర్‌ హరీస్‌ రౌఫ్‌, నమీబియా ఆల్‌రౌండర్‌ డేవిడ్‌ వీస్‌ ట్విటర్‌ ద్వారా విషెస్‌ తెలిపారు. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ ఈ వివాహం కోసం ప్రత్యేకంగా కరాచీకి వచ్చినట్లు సమాచారం. నిఖా తర్వాత జరిగే మెహంది కార్యక్రమం ఇవాళ రాత్రి జరుగనుంది. ఈ కార్యక్రమంలో పాక్‌ క్రికెటర్లతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది.

కాగా, షాహీన్‌-అన్షాల ఎంగేజ్‌మెంట్‌ రెండేళ్ల క్రితమే జరిగింది. నాటి నుంచి వీరి వివాహం అదిగో ఇదిగో అంటూ మీడియాలో పుకార్లు వచ్చాయి. ప్రస్తుతం పాక్‌కు అంతర్జాతీయంగా ఎలాంటి షెడ్యూల్‌ లేకపోవడంతో ఆ దేశ క్రికెటర్లంతా విదేశీ లీగ్‌ల్లో బిజీగా ఉన్నారు. షాహీన్‌ అఫ్రిది కూడా వివాహానికి కొద్ది రోజుల ముందు వరకు బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడాడు.

పాకిస్తాన్‌ తదుపరి షెడ్యూల్‌ ఏప్రిల్‌ 13 నుంచి మొదలవుతుంది. 5 టీ20లు, 5 వన్డేలు ఆడేందుకు న్యూజిలాండ్‌ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించనుంది. 22 ఏళ్ల షాహీన్‌ అఫ్రిది ఇప్పటివరకు పాక్‌ తరఫున 25 టెస్ట్‌లు, 32 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. ఇందులో 99 టెస్ట్‌ వికెట్లు, 62 వన్డే వికెట్లు, 58 టీ20 వికెట్లు పడగొట్టాడు. 

Videos

అందాల యుద్ధం

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడి ఉపనయన వేడుక

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో కాదు.. సుకుమార్ తోనే ..

అల్లు అర్జున్ లేకుండా ఆర్య 3

చంద్రబాబుకు విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు

వార్ 2 డైరెక్టర్ పై మండిపడుతున్న Jr. NTR ఫ్యాన్స్.. కారణం అదేనా

స్కాంలకు పరాకాష్ట అమరావతి పేరుతో దోపిడీనే : వైఎస్ జగన్

ఈనాడు టాయిలెట్ పేపర్ కి ఎక్కువ.. టిష్యూ పేపర్ కి తక్కువ..

చంద్రబాబు అప్పుల చిట్టా.. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ జగన్

మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)