Breaking News

అగ్రస్థానాల్లో పాకిస్తాన్‌ ఆటగాళ్లు..!

Published on Wed, 11/13/2024 - 16:29

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌ ఆటగాళ్లు సత్తా చాటారు. ఆ జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ షాహీన్‌ అఫ్రిది బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అఫ్రిది ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఇరగదీశాడు. మూడు మ్యాచ్‌ల ఆ సిరీస్‌లో అఫ్రిది 12.62 సగటున ఎనిమిది వికెట్లు తీశాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అఫ్రిది మూడు స్థానాలు ఎగబాకగా.. టాప్‌ ప్లేస్‌లో ఉండిన కేశవ్‌ మహారాజ్‌ రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

తాజా ర్యాంకింగ్స్‌లో అఫ్రిదితో పాటు అతని సహచరుడు హరీస్‌ రౌఫ్‌ కూడా భారీగా లబ్ది పొందాడు. ఆసీస్‌పై సంచలన ప్రదర్శనల (3 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు) అనంతరం రౌఫ్‌ 14 స్థానాలు మెరుగుపర్చుకుని 13వ స్తానానికి ఎగబకాడు. అలాగే మరో పాక్‌ బౌలర్‌ నసీం షా కూడా ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. నసీం 14 స్థానాలు మెరుగుపర్చుకుని 55వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్‌ నుంచి కుల్దీప్‌ యాదవ్‌ (4), జస్ప్రీత్‌ బుమ్రా (6), మొహమ్మద్‌ సిరాజ్‌ (7) టాప్‌-10లో ఉన్నారు.

బ్యాటింగ్‌ విషయానికొస్తే.. పాక్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బాబర్‌ 80 పరుగులు చేసి రెండు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో షాహీన్‌ అఫ్రిది టాప్‌ ప్లేస్‌కు చేరడంతో బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో పాక్‌ ఆటగాళ్లే అగ్రస్థానాలను ఆక్రమించినట్లైంది. 

తాజా ర్యాంకింగ్స్‌లో ప్రస్తుత పాక్‌ కెప్టెన్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ కూడా రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 23వ స్థానానికి చేరాడు. బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ నజ్ముల్‌ హసన్‌ షాంటో 11 స్థానాలు మెరుగుపర్చుకుని 24వ స్థానానికి ఎగబాకాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో 98 పరుగులు చేసిన బంగ్లా ఆటగాడు మహ్మదుల్లా 10 స్థానాలు మెరుగుపర్చుకుని 44వ స్థానానికి చేరాడు. టాప్-10 ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి వరుసగా 2 నుంచి 4 స్థానాల్లో నిలిచారు.

ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన మొహమ్మద్‌ నబీ టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. జింబాబ్వే సికందర్‌ రజా రెండో స్థానంలో, రషీద్‌ ఖాన్‌ మూడో స్థానంలో ఉన్నారు. బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ మెహిది హసన్‌ మీరాజ్‌ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి ఎగబాకాడు. భారత్‌ నుంచి రవీంద్ర జడేజా 14వ స్థానంలో ఉన్నాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)