Breaking News

రిజ్వాన్‌పై వేటు.. పాకిస్తాన్‌కు కొత్త కెప్టెన్‌! ఎవరంటే?

Published on Tue, 10/21/2025 - 07:52

ద‌క్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ వ‌న్డే జ‌ట్టు కెప్టెన్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌పై పీసీబీ వేటు వేసింది. అత‌డి స్ధానంలో స్టార్ పేస‌ర్ షాహీన్ షా అఫ్రిదిని పీసీబీ సెల‌క్ష‌న్ క‌మిటీ నియ‌మించింది. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల సిరీస్ నుంచి పాకిస్తాన్ వ‌న్డే జ‌ట్టు ప‌గ్గాల‌ను అఫ్రిది చేప‌ట్ట‌నున్నాడు.

రిజ్వాన్ సార‌థ్యంలో పాక్ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయిది. ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో క‌నీసం ఒక్క మ్యాచ్ కూడా గెల‌వ‌లేక‌పోయిన మెన్ ఇన్ గ్రీన్‌.. వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ల‌ను కూడా కోల్పోయింది. రిజ్వాన్ నాయకత్వంలో పాక్ కేవ‌లం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై మాత్ర‌మే వన్డే సిరీస్ విజ‌యాలు సాధించింది. ఈ క్ర‌మంలోనే రిజ్వాన్‌ను కెప్టెన్సీ నుంచి సెల‌క్ట‌ర్లు త‌ప్పించారు.

సోమవారం పాకిస్తాన్ సీనియర్ సెలక్షన్ కమిటీ సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌కు వైట్ బాల్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వన్డే జట్టు కెప్టెన్‌గా షాహీన్ షా అఫ్రిదిని ఎంపిక చేశారు.  దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ నుంచి పాక్ వన్డే జట్టుకు షాహీన్ నాయకత్వం వహిస్తాడని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. 

దీంతో పాక్ జట్టుకు ఇప్పుడు మూడు ఫార్మాట్లలో వెర్వేరు కెప్టెన్లు ఉన్నారు. టెస్టు‍ల్లో షాన్ మసూద్ పాక్ సారథి ఉండగా.. టీ20ల్లో సల్మాన్ అలీ అఘా, వన్డేల్లో షాహీన్ సారథిలుగా ఉన్నారు. షాహీన్ ఇంతకుముందు పాక్ టీ20 కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కానీ న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-4 తేడాతో పాక్ కోల్పోవడంతో అతడిని కెప్టెన్సీ నుంచి సెలక్టర్లు తప్పించారు. 

మళ్లీ ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్‌లో పాక్ జట్టు పగ్గాలను చేపట్టేందుకు అఫ్రిది సిద్దమయ్యాడు. 25 ఏళ్ల షాహీన్ పాకిస్తాన్ తరపున 66 వన్డేలు ఆడి 131 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో తలపడుతోంది. 
చదవండి: సిరాజ్‌ను వెనక్కు నెట్టిన జింబాబ్వే బౌలర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)