Breaking News

ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన షాహిన్‌ ఆఫ్రిది

Published on Sat, 08/09/2025 - 11:26

పాకిస్తాన్‌ పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది (Shaheen Afridi) అరుదైన ఘనత సాధించాడు. తక్కువ వన్డేల్లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్‌ మేటి స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును షాహిన్‌ బద్దలు కొట్టాడు. వెస్టిండీస్‌తో శుక్రవారం నాటి తొలి వన్డేలో భాగంగా అతడు ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

వన్డే సిరీస్‌లోనూ శుభారంభం
కాగా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలుత పొట్టి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న పాక్‌.. వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. ట్రినిడాడ్‌ వేదికగా ఆతిథ్య జట్టును ఐదు వికెట్ల తేడాతో ఓడించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన రిజ్వాన్‌ బృందం.. వెస్టిండీస్‌ను 280 పరుగులకు ఆలౌట్‌ చేసింది. బ్రాండన్‌ కింగ్‌ (4), షాయీ హోప్‌ (55), రొమారియో షెఫర్డ్‌ (4) రూపంలో మూడు కీలక వికెట్లతో పాటు.. షమార్‌ జోసెఫ్‌ (8) వికెట్‌ను కూడా షాహిన్‌ ఆ‍ఫ్రిది తన ఖాతాలో వేసుకున్నాడు.

మొత్తంగా నాలుగు వికెట్లు కూల్చి విండీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని షాహిన్‌ శాసించాడు. అతడికి తోడుగా నసీం షా (Naseem Shah) కూడా మూడు వికెట్లతో చెలరేగాడు. మిగిలిన వారిలో సయీమ్‌ ఆయుబ్‌, సూఫియాన్‌ ముకీమ్‌, సల్మాన్‌ ఆఘా ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

నవాజ్‌ ధనాధన్‌
ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌ 48.5 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టపోయి 284 పరుగులు సాధించింది. తద్వారా విండీస్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. పాక్‌ బ్యాటర్లలో బాబర్‌ ఆజం (47) రాణించగా.. కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ (53) అర్ధ శతకంతో మెరిశాడు.

ఇక వన్డే అరంగేట్ర బ్యాటర్‌ హసన్‌ నవాజ్‌ (54 బంతుల్లో 63), హుసేన్‌ తలత్‌ (37 బంతుల్లో 41) ధనాధన్‌ దంచికొట్టాడు. వీరిద్దరు ఆఖరి వరకు అజేయంగా నిలిచి పాకిస్తాన్‌ గెలుపును ఖరారు చేశారు.

ఇదిలా ఉంటే.. తన అంతర్జాతీయ కెరీర్‌లో షాహిన్‌ ఆఫ్రిదికి ఇది 65వ వన్డే. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడం ద్వారా ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌.. వన్డేల్లో 131 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 

ఈ క్రమంలో రషీద్‌ ఖాన్‌ను  దాటేసి.. 65 వన్డేల తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షాహిన్‌ రికార్డులకెక్కాడు. అంతకు ముందు రషీద్‌ 65 వన్డేల్లో కలిపి 128 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. రషీద్‌ ఖాన్‌ ఇప్పటికి 114 వన్డేలు పూర్తి చేసుకుని 199 వికెట్లు సాధించాడు.

వెస్టిండీస్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ తొలి వన్డే సంక్షిప్త స్కోర్లు
👉వెస్టిండీస్‌: 280 (49)
👉పాకిస్తాన్‌: 284/5 (48.5)
👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై పాకిస్తాన్‌ విజయం
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: హసన్‌ నవాజ్‌.

చదవండి: Mohammed Siraj: అసదుద్దీన్‌ ఒవైసీకి సిరాజ్‌ రిప్లై ఇదే.. పోస్ట్‌ వైరల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)