Breaking News

ప్రతీక స్థానంలో షఫాలీ 

Published on Tue, 10/28/2025 - 04:56

ముంబై: మహిళల వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌కు భారత ఓపెనర్‌ ప్రతీక రావల్‌ దూరమైంది. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ ఆమె గాయపడింది. ఫిజియో సహాయంతో ఆమె మైదానం వీడాల్సి వచ్చింది. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం ప్రతీక తర్వాతి మ్యాచ్‌ ఆడే అవకాశం లేదని ఖాయమైంది. ప్రతీక స్థానంలో షఫాలీ వర్మను సెలక్టర్లు ఎంపిక చేశారు. 

వరల్డ్‌ కప్‌ కోసం ఎంపిక చేసిన టీమ్‌లో షఫాలీకి చోటు దక్కలేదు. ఏడాది క్రితం షఫాలీ తన చివరి వన్డే ఆడింది. వరుస వైఫల్యాల తర్వాత ఆమె స్థానంలోనే వచ్చిన ప్రతీక తన నిలకడైన ఆటతో ఓపెనింగ్‌ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రతీక ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో (308 పరుగులు) ఉంది. 

ఇప్పుడు టీమ్‌లో ఉన్న ప్లేయర్లలో హర్లీన్, అమన్‌జ్యోత్, ఉమా ఛెత్రి, జెమీమాలతోపాటు రిజర్వ్‌ బ్యాటర్‌ తేజల్‌ హసబ్నిస్‌కు కూడా ఓపెనింగ్‌ చేసే సామర్థ్యం ఉన్నా... వారిని కాదని రిజర్వ్‌ జాబితాలో కూడా లేని షఫాలీని జట్టులోకి తీసుకున్నారు. 

దూకుడుకు మారుపేరైన 21 ఏళ్ల షఫాలీ కీలక మ్యాచ్‌లో స్మృతితో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగనుంది. భారత్‌ తరఫున 29 వన్డేల్లో 23 సగటుతో షఫాలీ 644 పరుగులు చేసింది. ఇందులో 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. టీమ్‌లో స్థానం కోల్పోయిన తర్వాత భారత ‘ఎ’ జట్టు తరఫున ఆమె నిలకడగా రాణిస్తూ పరుగులు సాధిస్తోంది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడుతుంది.   
 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)