Breaking News

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల ప్ర‌పంచ రికార్డు

Published on Mon, 10/26/2026 - 10:58

సొంత‌గ‌డ్డ‌పై జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో పాకిస్తాన్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. ఆదివారం లహోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలువ మ్యాచ్‌లో ఒక్క వికెట్ తేడాతో పాక్ సంచలన విజయం సాధించింది.  242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 154 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది.

ఈ స‌మ‌యంలో ఆల్‌రౌండ‌ర్ షాదాబ్ ఖాన్(96 బంతుల్లో 113) వీరోచిత సెంచ‌రీతో జ‌ట్టుకు చారిత్ర‌త్మ‌క విజ‌యాన్ని అందించాడు. ఫాస్ట్ బౌల‌ర్ హారిస్ రవూప్‌తో క‌లిసి  10వ వికెట్‌కు కేవలం 80 బంతుల్లో 89 పరుగులు జోడించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. దీంతో షాదాబ్‌-ర‌వూఫ్ జోడీ ఓ ప్ర‌పంచ రికార్డును త‌మ పేరిట లిఖించుకున్నారు.

55 ఏళ్ల‌ వన్డే క్రికెట్ చరిత్రలో విజ‌య‌వంత‌మైన ల‌క్ష్య చేధ‌న‌లో 10వ వికెట్‌కు నమోదు చేసిన అత్యధిక భాగస్వామ్యం జోడీగా వారిద్ద‌రూ నిలిచారు. ఇంత‌క‌ముందు ఈ రికార్డు వెస్టిండీస్ మాజీ ప్లేయ‌ర్  డెరిక్ ముర్రే, ఆండీ రాబర్ట్స్ పేరిట ఉండేది. 1975లో జరిగిన తొలి ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్‌లో వారిద్ద‌రూ ప‌దో వికెట్‌కు 64 ప‌రుగుల అజేయ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. తాజా మ్యాచ్‌తో వారి ఆల్‌టైమ్ రికార్డును షాదాబ్‌-రవూఫ్ జంట బ్రేక్ చేసింది.

అదేవిధంగా ఈ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన షాదాబ్ ఖాన్ సైతం ఓ ప్ర‌పంచ రికార్డును త‌మ పేరిట లిఖించుకున్నాడు.  ఎనిమిది లేదా ఆ త‌ర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వ‌చ్చి అంతర్జాతీయ వ‌న్డేల్లో అత్య‌ధిక స్కోరు న‌మోదు చేసిన తొలి బ్యాట‌ర్‌గా షాదాబ్ ఖాన్ నిలిచాడు. గ‌తంలో ఐర్లాండ్ బ్యాట‌ర్ సిమీ సింగ్ (100 నాటౌట్ వ‌ర్సెస్ సౌతాఫ్రికా) పేరిట ఉన్న రికార్డును షాదాబ్ తిర‌గ‌రాశాడు.
చదవండి: మూడో టీ20కి ఇషాన్‌ దూరం.. బీసీసీఐ అధికారిక ప్రకటన

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)