Breaking News

మ్యాచ్ జరుగుతుండగా ఉగ్రదాడి.. సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌పై నీలినీడ‌లు?

Published on Sun, 09/07/2025 - 16:22

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉగ్ర‌దాడి తీవ్ర క‌లక‌లం రేపింది.  ఉగ్ర‌వాదులు బజౌర్ జిల్లా ఖార్ తహసీల్‌లోని కౌసర్ క్రికెట్ గ్రౌండ్‌ను ఉగ్ర‌వాదులు టార్గెట్ చేశారు. శ‌నివారం కౌసర్ క్రికెట్ మైదానంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది.

ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని స్థానిక పోలీసులు వెల్లడించారు. ఐఈడీని ఉపయోగించి పేలుడు జరిపారని బజౌర్ జిల్లా పోలీసు అధికారి వక్వాస్ రఫీక్వ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. గాయపడిన వారిని జిల్లా ప్రధాన అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సదరు అధి​​కారి తెలిపారు. 

ఇప్పటివరకు ఏ ఉగ్రవాది సంస్థ కూడా బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటన చేయలేదు. అయితే  ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా  భద్రతా దళాలు ప్రారంభించిన 'ఆపరేషన్ సర్బకాఫ్'కు ప్రతిస్పందనగా ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

స్వల్ప  తొక్కిసలాట..
ఈ పేలుడు తర్వాత క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లు, మైదానంలో ఉన్న వీక్షకులు భయంతో పరుగులు తీశారు. ఈ సంద‌ర్భంగా స్వల్ప  తొక్కిసలాట చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఇటీవల కాలంలో ఈ తరహా సంఘటన జరగడం ఇది రెండో సారి. కొన్ని వారాల కిందట పోలీస్ స్టేషన్‌పై  క్వాడ్‌కాప్టర్ ద్వారా దాడి జరిగింది. ఈ దాడిలో ఒక​ 
పోలీసు కానిస్టేబుల్ , పౌరుడు గాయపడ్డారు.

సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌పై నీలినీడ‌లు?
కాగా వ‌చ్చే నెల‌లో సౌతాఫ్రికా క్రికెట్ జ‌ట్టు మ‌ల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం పాకిస్తాన్‌లో ప‌ర్య‌టించ‌నుంది. ప్రోటీస్ టూర్‌కు ముందు త‌మ దేశంలో ఇటువంటి ఉగ్ర‌దాడులు జ‌రుగుతుండ‌డంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆందోళ‌న చెంద‌తుంది. అయితే ఇప్ప‌టికే సౌతాఫ్రికాకు చెందిన భ‌ద్ర‌తా అధికారులు కొంత మంది పాక్‌లో ప‌ర్య‌టిస్తున్నట్లు తెలుస్తోంది. 

రాబోయే రోజుల్లో ఇటువంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం అయితే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశముంది. ఇటీవల కాలంలో పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025తో పాటు పలు ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా జరిగాయి.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)