Breaking News

ఆమె తిరిగి వచ్చేస్తోంది.. జాగ్రత్త!

Published on Mon, 06/01/2026 - 21:21

అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ టెన్నిస్ కోర్టులోకి రీఎంట్రీ ఇవ్వనుంది. 23 గ్రాండ్‌స్లామ్ టోర్నీలతో మహిళల సింగిల్స్‌లో మకుటం లేని మహారాణిగా వెలుగొందిన సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమై నాలుగేళ్లు కావొస్తోంది. ఈ నేపథ్యంలో 44 ఏళ్ల వయసులో సెరెనా ఈ నెలలో జరగనున్న క్వీన్స్ క్లబ్ టోర్నీ ద్వారా టెన్నిస్ రాకెట్ పట్టనుంది. 

అయితే సెరెనా ఈ టోర్నీలో సింగిల్స్‌లో కాకుండా డబుల్స్‌లో బరిలోకి దిగుతోంది. 2022 యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మూడో రౌండ్‌లో ఓటమి తర్వాత సెరెనా మళ్లీ టెన్నిస్ ఆడలేదు. తాను టెన్నిస్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయాన్ని అమెరికా నల్లకలువ స్వయంగా పంచుకుంది. ‘ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నా’ అని క్యాప్షన్ జత చేసింది. 

దీనితో పాటు సెరెనా తెలుపు రంగు నైక్ టెన్నిస్‌ డ్రెస్‌తో పాటు మొబైల్ ఫోన్‌ను ఫొటోలో పంచుకుంది. అయితే ఫ్రొఫెషనల్ టెన్నిస్‌లోకి మాత్రం రావడం లేదని, కేవలం వైల్డ్‌కార్డ్‌గా క్వీన్స్‌క్లబ్ టోర్నీలో కెనడాకు చెందిన విక్టోరియా బోకోతో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడబోతున్నా అంటూ అసలు విషయాన్ని మెళ్లిగా చెప్పింది. 

దీంతో ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి సెరెనా రీఎంట్రీ ఇస్తుందంటూ తెగ సంబరపడిపోయిన అభిమానుల ఆశలు ఆవిరైపోయాయి. 2022లో యూఎస్ ఓపెన్ లో ఓటమి అనంతరం ఆటకు దూరంగా ఉన్న సెరెనా విలియమ్స్ ‘రిటైర్మెంట్‌’ అనే పదం వాడలేనని, దానికి బదులుగా టెన్నిస్ నుంచి ‘అదృశ్యం’ అవుతున్నానంటూ పరోక్షంగా వీడ్కోలు పలికింది. 

ఓపెన్ శకంలో మహిళల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన రెండో క్రీడాకారిణిగా సెరెనా విలియమ్స్ (23 టైటిల్స్‌) నిలిచింది. ఇక తొలి స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజం మార్గరెట్ కోర్ట్ (24 గ్రాండ్‌స్లామ్) టైటిల్స్‌తో కొనసాగుతుంది. సెరెనా సాధించిన 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌లో ఏడు ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌, మూడు ఫ్రెంచ్ ఓపెన్‌, ఏడు వింబుల్డ‌న్‌, ఆరు యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి.

చదవండి: కోహ్లీకి ఏడుపొక్కటే తక్కువ.. ఆ క‌వ‌ర్‌లో ఏముంది?

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)