నాలుగేళ్ల విరామం.. 90 నిమిషాల్లో విజయం

Published on Wed, 06/10/2026 - 08:15

నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ  రాకెట్ పట్టిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియ‌మ్స్‌.. త‌న రీఎంట్రీ మ్యాచ్‌లో అద‌ర‌గొట్టింది. క్వీన్స్ క్లబ్ ఛాంపియన్‌షిప్-2026 టోర్నీలో విక్టోరియా మ్బోకోతో(కెన‌డా) కలిసి ఆడిన సెరెనా,  మహిళల డబుల్స్ మొదటి రౌండ్‌లో అద్భుత‌మైన విజ‌యం సాధించింది. 

ఈ జోడీ మూడవ సీడ్ జంట అయిన ఎరిన్ రౌట్‌లిఫ్ (న్యూజిలాండ్), నికోల్ మెలిచార్-మార్టినెజ్ (అమెరికా)లపై వరుస సెట్లలో 7-6 (7-2), 6-2 తేడాతో గెలుపొందారు. ఈ మ్యాచ్ కేవలం 90 నిమషాల్లో ముగిసిపోయింది.

ఏజ్ గ్యాప్ 25 ఏళ్లు.. అయినా అద్భుత విజ‌యం
కాగా 44 ఏళ్ల సెరెనా విలియమ్స్, 19 ఏళ్ల విక్టోరియా మ్బోకోల మధ్య వయసు వ్యత్యాసం ఏకంగా 25 సంవత్సరాలు. అయినప్ప‌ట‌కి ఈ ద్వ‌యం అద్భుత‌మైన స‌మ‌న్వ‌యంతో ప్ర‌త్య‌ర్ధి జంట‌ను చిత్తు చేసింది. కాగా 2022 యూఎస్ ఓపెన్ తర్వాత టెన్నిస్‌కు బ్రేక్ ఇస్తున్న‌ట్లు సెరెనా ప్ర‌క‌టించింది.

అయితే ఇటీవ‌ల త‌న మ‌న‌సు మార్చుకున్న ఆమె తిరిగి కోర్ట్‌లో అడుగుపెట్టాల‌ని నిర్ణ‌యించుకుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఇదే మొదటి ప్రొఫెషనల్ మ్యాచ్. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా ఆమె ఈ టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చింది. సెరెనా కెరీర్‌లో మొత్తం 39 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు ఉన్నాయి. ఇందులో 23 మహిళల సింగిల్స్, 14 మహిళల డబుల్స్, రెండు మిక్స్‌డ్ డ‌బుల్స్ టైటిల్స్ ఉన్నాయి.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)