Breaking News

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియాలోకి ఎవరూ ఊహించని ఆటగాడు!

Published on Mon, 07/10/2023 - 10:16

వెస్టిండీస్‌ పర్యటన అనంతరం టీమిండియా మూడు టీ20ల సిరీస్‌ కోసం ఐర్లాండ్‌లో అడుగుపెట్టనుంది. ఆగస్టు 18న డబ్లిన్‌ వేదికగా జరగనున్న  తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఐర్లాండ్‌ టూర్‌కు కూడా భారత ద్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ పంపనున్నట్లు సమాచారం. ఎందుకంటే అదే నెలలో ఆసియాకప్‌ ప్రారంభం కానుండడంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లి, శుబ్‌మన్‌ గిల్‌, రవీంద్ర జడేజా వంటి స్టార్‌ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అయితే వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ చోటు ఆశించి భంగపాటు పడ్డ యువ ఆటగాళ్లకు ఐర్లాండ్‌ టూర్‌కు సెలక్ట్‌ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్‌లో అదరగొట్టిన రింకూ సింగ్‌, జితేష్‌ వర్మ వంటి ఆటగాళ్లకు చోటు దక్కే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. 

నితీష్‌ రాణా రీ ఎంట్రీ..
ఇక ఐర్లాండ్‌ సిరీస్‌కు జట్టు ఎంపిక విషయంలో ఎవరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న నితీష్‌ రాణా.. ఐర్లాండ్‌ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. రాణా చివరగా 2021 జూలైలో భారత జట్టు తరపున ఆడాడు. రాణా ఇప్పటి వరకు టీమిండియా తరపున కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

తనకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోకపోవడంతో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టారు. అయితే ఐపీఎల్‌-2023లో నితీష్‌ అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతో.. సెలక్టర్లు అతడికి మళ్లీ  పిలుపునివ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది సీజన్‌లో కేకేఆర్‌కు సారధ్యం వహించిన రాణా పర్వాలేదనపించాడు. 14 మ్యాచ్‌లు ఆడిన అతడు  31.77 సగటుతో 413 పరుగులు చేశాడు.
చదవండి: IND Vs WI 2023: భారత జట్టులో నో ఛాన్స్‌.. ‘దేవుడు నా కోసం పెద్ద ప్లాన్‌తో ఉన్నాడు’

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)