Breaking News

కళ్లకు గంతలు కట్టుకొని అంపైరింగ్.. సెహ్వాగ్ పోస్ట్ వైరల్‌

Published on Sun, 06/11/2023 - 09:47

లండన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఔటైన తీరు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించాడని థర్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరోను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించాడు.

థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని సెహ్వాగ్ తప్పుబట్టాడు. కళ్లకు గంతలు కట్టుకొని అంపైరింగ్ చేశాడని సెహ్వాగ్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కళ్లకు గంతలు కట్టుకున్న ఫొటోతో సెహ్వాగ్ ఫన్నీ మీమ్ సోషల్‌మీడియాలో షేర్‌ చేశాడు. "శుబ్‌మన్‌ గిల్‌ ఔట్‌ విషయంలో థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు కట్టుకొని నిర్ణయం తీసుకున్నాడు. సరైన ఆధారాలు లేకపోతే బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద నాటౌటగా ప్రకటించాలి. గిల్‌ది క్లియర్‌గా నాటౌట్‌" అని ట్విటర్‌లో సెహ్వాగ్ పేర్కొన్నాడు.
 
అసలేం జరిగిందంటే..?
టీమిండియా రెండో ఇన్నింగ్స్ 8వ వేసిన స్కాట్‌ బోలాండ్‌లో బౌలింగ్‌లో తొలి బంతిని గిల్‌ ఎదుర్కొన్నాడు.  బోలాండ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. గిల్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు.  కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి గల్లీ స్లిప్ ఫీల్డర్ వైపు దూసుకెళ్లింది. గల్లీలో ఉన్న కామెరూన్ గ్రీన్‍ అద్భుతంగా డైవ్‌ చేస్తూ క్యాచ్‌ను అందుకున్నాడు.

అయితే క్యాచ్ పట్టే క్రమంలో బంతి నేలకు తాకినట్లు అనిపించింది.. దీంతో ఫీల్డ్ అంపైర్స్.. థర్డ్ అంపైర్‌కు రెఫర్ చేశారు. పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్‌కు క్యాచ్ ఔట్ విషయంలో క్లారిటీ లభించలేదు. ఆఖరికి గ్రీన్ చేతి వేళ్లు బంతి కింద ఉన్నాయని చెబుతూ థర్డ్ అంపైర్‌ ఔటిచ్చాడు.
చదవండి: WTC FINAL: రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు.. మూడో భారత ఓపెనర్‌గా

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)