ఆ నలుగురిని వదిలేస్తేనే సీఎస్‌కే బాగుపడుతుంది: సెహ్వాగ్‌

Published on Sat, 04/26/2025 - 12:36

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ (Virender Sehwag) వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఘన చరిత్ర ఉన్న సీఎస్‌కే (CSK).. ఈసారి మాత్రం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికే గురిపెట్టిందని పేర్కొన్నాడు. తద్వారా ఆఖరి స్థానంలో ఉండటంలో ఉండే మజాను ఆస్వాదించాలని ఉవ్విళ్లూరుతోందంటూ సెటైర్లు వేశాడు.

కాగా ఐపీఎల్‌లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలవడంతో పాటు అత్యధిక సార్లు ఫైనల్‌ చేరిన జట్టుగా చెన్నైకి రికార్డు ఉంది. అయితే, ధోని (MS Dhoni) సారథ్య బాధ్యతల నుంచి నిష్క్రమించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. గత సీజన్‌లో కెప్టెన్‌గా వచ్చిన రుతురాజ్‌ గైక్వాడ్‌ ప్లే ఆఫ్స్‌ చేర్చలేకపోయాడు.

ఇక ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌ల తర్వాత గాయపడి రుతు జట్టుకు దూరం కాగా.. ధోని మరోసారి పగ్గాలు చేపట్టాడు. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ చెన్నై ఓటమి పాలైంది. ఈ ఎడిషన్‌లో సీఎస్‌కేకు తొమ్మిదింట ఇది ఏడో పరాజయం. దీంతో ప్లే ఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా ముగిసిపోయాయి.

తొలిసారి అట్టడుగున.. ఆ కిక్కే వేరప్పా!
ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ స్పందిస్తూ.. ‘‘చెన్నై పదో స్థానంతో ముగిస్తుందో లేదో నాకు తెలియదు. కానీ వాళ్లు ఆ పని చేశారంటే ఎంతో బాగుంటుంది. ఎందుకంటే.. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నపుడు.. ఆ అనుభూతి ఎలా ఉంటుందో వారు అనుభవించగలుగుతారు.

ఎన్నో ఫైనల్స్‌ ఆడిన తర్వాత ఇలాంటి అనుభవం వారికి అవసరమే’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అదే విధంగా.. వచ్చే ఏడాది చెన్నై నలుగురు ప్లేయర్లను వదులుకుంటేనే బాగుంటుందంటూ ఇద్దరు దేశీ, ఇద్దరు విదేశీ క్రికెటర్ల పేర్లు చెప్పాడు.

ఆ నలుగురిని వదిలేస్తేనే సీఎస్‌కే బాగుపడుతుంది
‘‘డెవాన్‌ కాన్వే, రచిన్‌ రవీంద్ర, రవిచంద్రన్‌ అశ్విన్‌, విజయ్‌ శంకర్‌.. వచ్చే ఏడాది సీఎస్‌కేలో వీరి పేర్లు ఉండకపోవచ్చు. ఒకవేళ నేను గనుక మేనేజ్‌మెంట్‌ స్థానంలో ఉంటే.. ఆ నలుగురి స్థానాలను కొత్త ముఖాలతో భర్తీ చేస్తాను.

జట్టును నిర్మించడం అంటే ఒక్క సీజన్‌కే పరిమితం కాకూడదు. కనీసం పదేళ్ల పాటు ఆ జట్టు బలంగా ఉండాలి. అప్పుడే పరిస్థితిలో మార్పు వస్తుంది’’ అని సెహ్వాగ్‌ క్రిక్‌బజ్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

ఐపీఎల్‌-2025: చెన్నై వర్సెస్‌ హైదరాబాద్‌
👉వేదిక: చెపాక్‌ స్టేడియం, చెన్నై
👉టాస్‌: హైదరాబాద్‌.. తొలుత బౌలింగ్‌
👉చెన్నై స్కోరు: 154 (19.5)
👉హైదరాబాద్‌ స్కోరు: 155/5 (18.4)
👉ఫలితం: చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన హైదరాబాద్‌.

చదవండి: CSK vs SRH: ‘బుర్ర పనిచేయడం లేదా’?!.. మెండిస్‌పై కావ్యా మారన్‌ ఫైర్‌!
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)