Breaking News

మళ్లీ శతక్కొట్టిన సర్ఫరాజ్‌ ఖాన్‌.. ఈసారి సెలెక్టర్లు తప్పించుకోలేరు..!

Published on Tue, 08/26/2025 - 19:24

తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ ఆథ్వర్యంలో జరుగుతున్న బుచ్చిబాబు టోర్నీలో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌, ముంబై స్టార్‌ ప్లేయర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ వరుస సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో టీఎన్‌సీఏ ఎలెవెన్‌పై 114 బంతుల్లో 138 పరుగులు (9 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసిన అతడు.. హర్యానాతో ఇవాళ (ఆగస్ట్‌ 26) ప్రారంభమైన మ్యాచ్‌లో 112 బంతుల్లో 111 పరుగులు (9 ఫోర్లు, 5 సిక్సర్లు) చేశాడు. 

హర్యానాతో మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ తన జట్టు కష్టాల్లో (81/3) ఉన్నప్పుడు బరిలోకి దిగి సూపర్‌ సెంచరీతో మెరిశాడు. హార్దిక్‌ తామోర్‌తో కలిసి జట్టు స్కోర్‌ను 200 పరుగుల మార్కును దాటించాడు. 59 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి.. ఆతర్వాత 40 బంతుల్లో శతక మైలురాయిని తాకాడు.

టీఎన్‌సీఏ ఎలెవెన్‌పై కూడా సర్ఫరాజ్‌ ఇదే తరహాలో సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కూడా కష్టాల్లో ఉన్న తన జట్టును సెంచరీతో గట్టెక్కించాడు. ఆ ఇన్నింగ్స్‌లో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగిన సర్ఫరాజ్‌ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 36 పరుగులు చేశాడు. అయినా ఆ మ్యాచ్‌లో ముంబై ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌ తర్వాత ముంబై ఆడిన రెండో మ్యాచ్‌లో (బెంగాల్‌తో) సర్ఫరాజ్‌ ఖాన్‌ ఆడలేదు. తిరిగి మూడో మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చి మరోసారి శతక్కొట్టాడు.

27 ఏళ్ల సర్ఫరాజ్‌ తాజా ప్రదర్శనలతో భారత సెలెక్టర్లకు సవాల్‌ విసిరాడు. సర్ఫరాజ్‌ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ సెలెక్టర్లు అతడ్ని ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపిక చేయలేదు. ఆ పర్యటనలో సర్ఫరాజ్‌ స్థానంలో అవకాశం దక్కించుకున్న కరుణ్‌ నాయర్‌ దారుణంగా విఫలం కావడంతో సెలెక్టర్లు మళ్లీ సర్ఫరాజ్‌ ఖాన్‌ వైపు చూసే అవకాశం ఉంది. 

సర్ఫరాజ్‌ గతేడాదే స్వదేశంలో ఇంగ్లండ్‌పై టెస్ట్‌ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే రెండు హాఫ్‌ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఆతర్వాత న్యూజిలాండ్‌పై భారీ సెంచరీతో (150) మెరిశాడు. ఈ ప్రదర్శన తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైనప్పటికీ.. తుది జట్టులో అవకాశాలు దక్కలేదు. 

కెరీర్‌లో మొత్తం 6 టెస్ట్‌లు ఆడిన సర్ఫరాజ్‌ సెంచరీ, 3 అర్ద సెంచరీల సాయంతో 37.10 సగటున 371 పరుగులు చేశాడు. బుచ్చిబాబు టోర్నీ తర్వాత సర్ఫరాజ్‌ ఖాన్‌ దులీప్‌ ట్రోఫీ ఆడనున్నాడు. ఆ టోర్నీలో కూడా సర్ఫరాజ్‌ సెంచరీలు చేస్తే సెలెక్టర్లు అతన్ని తప్పక టెస్ట్‌ జట్టుకు ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)