Breaking News

సౌద్ ష‌కీల్ సూప‌ర్ సెంచ‌రీ.. విజ‌యం దిశ‌గా పాక్‌!

Published on Fri, 10/25/2024 - 18:00

రావ‌ల్పిండి వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో పాకిస్తాన్ విజ‌యం దిశగా ప‌య‌నిస్తోంది. పాక్ స్పిన్న‌ర్ల దాటికి ప‌ర్యాట‌క ఇంగ్లీష్ జ‌ట్టు విల్లవిల్లాడుతోంది. 77 ప‌రుగుల లోటు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్ త‌డ‌బడుతోంది. 

రెండో రోజు ఆట ముగిసే స‌మయానికి ఇంగ్లండ్ త‌మ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 24 ప‌రుగులు చేసింది.  ఇంగ్లండ్ ఇంకా 53 ప‌రుగుల వెన‌కంజ‌లో ఉంది. ప్ర‌స్తుతం క్రీజులో జో రూట్‌(5), హ్యారీ బ్రూక్ ఉన్నారు. పాక్ స్పిన్న‌ర్లు నోమన్ అలీ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సాజిద్ ఖాన్ వికెట్ సాధించాడు.

ష‌కీల్ సూప‌ర్ సెంచ‌రీ..
అంత‌కుముందు పాక్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 344 ప‌రుగుల‌కు ఆలౌటైంది. పాక్ వైస్ కెప్టెన్ సౌద్ ష‌కీల్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. క‌ష్టాల్లో ఉన్న జ‌ట్టును త‌న సెంచ‌రీతో ష‌కీల్ గ‌ట్టెక్కించాడు. 223 బంతులు ఎదుర్కొన్న ష‌కీల్ 5 ఫోర్లతో 134 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. 

అత‌డితో పాటు టెయిలాండ‌ర్లు నోమన్ అలీ(45), సాజిద్ ఖాన్‌(48) కీల‌క ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో లెగ్ స్పిన్న‌ర్ రెహాన్ ఆహ్మ‌ద్ 4 వికెట్ల‌తో మెర‌వ‌గా.. షోయ‌బ్ బషీర్ మూడు, అట్కిన‌స‌న్ రెండు వికెట్లు సాధించారు. కాగా ఇంగ్లండ్ త‌మ మొద‌టి ఇన్నింగ్స్‌లో 267 ప‌రుగుల నామ‌మాత్ర‌పు స్కోర్‌కే ప‌రిమిత‌మైంది.
చదవండి: Asia T20 Cup: చెలరేగిన బ్యాటర్లు.. సెమీస్‌లో లంక చేతిలో పాక్‌ చిత్తు

Videos

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)