Breaking News

'అతడొక అద్భుతం.. కచ్చితంగా కోహ్లి అంతటివాడవుతాడు'

Published on Fri, 08/11/2023 - 19:47

పాకిస్తాన్‌ యువ ఆటగాడు సౌద్ షకీల్‌పై ఆ జట్టు మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసల వర్షం కురిపించాడు. సౌద్ షకీల్‌ భవిష్యత్తులో భారత ‍స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి, పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం స్ధాయికి చేరుకుంటాడని అక్మల్‌ కొనియాడాడు. సౌద్ షకీల్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో షకీల్‌ అదరగొడుతున్నాడు.

గత నెలలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో షకీల్‌ సంచలన డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 7 టెస్టులు ఆడిన షకీల్‌.. 87.5 సగటుతో 875 పరుగులు చేశాడు. అదేవిధంగా శ్రీలంకపై గడ్డపై టెస్టుల్లో తొలి డబుల్‌ సెంచరీ చేసిన పాక్‌ క్రికెటర్‌గా రికార్డెలకెక్కాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ క్రికెట్‌తో అక్మల్‌ మాట్లాడుతూ.. "సౌథ్‌ షకీల్‌లో అద్బుతమైన టాలెంట్‌ ఉంది.

                                       

అతడిని పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో దగ్గర నుంచి చూశాను. ప్రపంచ క్రికెట్‌లో షకీల్‌ అత్యున్నత స్ధాయికి చేరుకుంటాడు. అతడు కచ్చితంగా విరాట్‌ కోహ్లి, బాబర్‌ ఆజం అంతటి వాడవుతాడు. వచ్చే మూడు నాలుగేళ్లలో వారి స్ధాయికి షకీల్‌ చేరుకుంటాడని ఆశిస్తున్నా. క్లిష్టమైన పరిస్ధితుల్లో జట్టు ఉన్నప్పుడు అతడు ఆడిన విధానం అద్భుతం. టెస్టుల్లో ఆడటం చాలా కష్టం. చిన్న వయస్సులోనే షకీల్‌ ఈ విధంగా ఆడటం.. పాకిస్తాన్‌కు  శుభసూచికమని" చెప్పుకొచ్చాడు.
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో నాలుగో టీ20.. గిల్‌పై వేటు! విధ్వంసకర ఆటగాడికి మరో ఛాన్స్‌

Videos

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)