Breaking News

సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం ముందుకు

Published on Fri, 01/10/2025 - 04:24

కౌలాలంపూర్‌: మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ తమ జోరు కొనసాగిస్తోంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో గత ఏడాది రన్నరప్‌ సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 21–15, 21–15తో నూర్‌ మొహమ్మద్‌ అజ్రియాన్‌–టాన్‌ వీ కియోంగ్‌ (మలేసియా) జోడీపై గెలిచింది. 

43 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లో భారత జంట స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌లో యె సిన్‌ ఓంగ్‌–ఈ యి టియో (మలేసియా)లతో సాత్విక్‌–చిరాగ్‌ తలపడతారు. ‘కొత్త సీజన్‌లో శుభారంభం లభించింది. కొత్త కోచ్‌తో మళ్లీ కలిసి పని చేస్తున్నాం. అంతా సవ్యంగా సాగుతోంది’ అని విజయానంతరం సాత్విక్‌–చిరాగ్‌ వ్యాఖ్యానించారు.  మహిళల డబుల్స్‌లో భారత కథ ముగిసింది. 

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 21–15, 19–21, 19–21తో జియా యీ ఫాన్‌–జాంగ్‌ షు జియాన్‌ (చైనా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ధ్రువ్‌ కపిల–తనీషా క్రాస్టో (భారత్‌) జంట 13–21, 20–22తో చెంగ్‌ జింగ్‌–జాంగ్‌ చి (చైనా) ద్వయం చేతిలో... సతీశ్‌ కరుణాకరన్‌–ఆద్యా వరియత్‌ (భారత్‌) జంట 10–21, 17–21తో సూన్‌ హువార్‌ గో–షెవోన్‌ జెమీలాయ్‌ (మలేసియా) జోడీ చేతిలో పరాజయం చవిచూశాయి.  

సింగిల్స్‌ విభాగంలోనూ భారత పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రణయ్‌ 8–21, 21–15, 21–23తో లీ షి ఫెంగ్‌ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు. 82 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్‌ నిర్ణాయక మూడో గేమ్‌లో ఒక మ్యాచ్‌ పాయింట్‌ వదులుకోవడం గమనార్హం. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మాళవిక బన్సోద్‌ (భారత్‌) 18–21, 11–21తో హాన్‌ యువె (చైనా) చేతిలో ఓడిపోయింది. 
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)