Breaking News

చైనా మాస్టర్స్‌ టోర్నీ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ

Published on Sun, 09/21/2025 - 04:06

షెన్‌జెన్‌ (చైనా): భారత అగ్రశ్రేణి జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ షెట్టి వరుసగా రెండో టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. చైనా మాస్టర్స్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం టైటిల్‌ పోరుకు అర్హత సంపాదించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్‌ భారత జోడీ వరుస సెట్లలో మాజీ ప్రపంచ చాంపియన్స్, రెండో సీడ్‌ ఆరోన్‌ చియా–సో వూ యిక్‌ (మలేసియా) జంటపై అద్భుత విజయం సాధించింది. 

సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 21–17, 21–14తో మలేసియన్‌ ప్రత్యర్థి జంటను ఓడించింది. రెండుసార్లు ఒలింపిక్‌ పతకాలు నెగ్గిన ప్రత్యర్థి జంట ఈ సెమీస్‌ మ్యాచ్‌కు ముందు భారత ద్వయంపై 11–4 తేడాతో ఆధిపత్యంలో ఉంది. అలాంటి జోడీపై సాత్విక్‌–చిరాగ్‌లు ఈ సెమీస్‌లో మాత్రం చెలరేగారు. కేవలం 41 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించి విజయం సాధించారు. 

ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో హాంకాంగ్‌ ఓపెన్‌ బరిలోకి దిగిన భారత జంట రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో టైటిల్‌పై కన్నేసింది. నేడు జరిగే ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ టాప్‌ సీడ్‌ కిమ్‌ వోన్‌ హో–సియో సియంగ్‌ జే జంటతో తలపడుతుంది. 

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)