Breaking News

సెమీస్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ

Published on Sat, 09/20/2025 - 03:50

షెన్‌జెన్‌: ఈ ఏడాది తొలి టైటిల్‌ కోసం వేచి చూస్తున్న భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ జోడీ ఆ దిశగా మరో అడుగు వేసింది. చైనా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీలో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జంట 21–14, 21–14తో రెన్‌ జియాంగ్‌ యు–జియె హావోనన్‌ (చైనా) జోడీపై విజయం సాధించింది. 

38 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లోనూ భారత జోడీ ఆధిపత్యం కనబరిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంక్‌ జోడీ ఆరోన్‌ చియా–సో వుయ్‌ యిక్‌ (మలేసియా)తో సాత్విక్‌–చిరాగ్‌ జంట తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 4–11తో వెనుకంజలో ఉంది.  

సింధు ఎనిమిదో‘సారీ’ 
మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత స్టార్‌ పీవీ సింధు పోరాటం ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్‌ ఆన్‌ సె యంగ్‌ (దక్షిణ కొరియా)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్‌ సింధు 14–21, 13–21తో పరాజయం పాలైంది. 

ఆన్‌ సె యంగ్‌తో ఇప్పటి వరకు ఆడిన ఎనిమిదిసార్లూ సింధు ఓడిపోవడం గమనార్హం. ఈ కొరియా స్టార్‌తో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో సింధు ఒక్క గేమ్‌ మాత్రమే గెలవగలిగింది. క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన సింధుకు 6,875 డాలర్ల (రూ. 6 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 6050 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.   

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)