Breaking News

జైస్వాల్‌పై సీరియస్‌ అయిన సర్ఫరాజ్.. రోహిత్‌ సైతం! వీడియో వైరల్‌

Published on Sun, 02/18/2024 - 20:11

సర్ఫరాజ్‌ ఖాన్‌.. తన అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో అదరగొట్టాడు. రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో సర్ఫరాజ్‌ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసిన ఈ ముంబైకర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం 68 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.

అయితే టీమిండియా సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్‌ కాస్త తన సహనాన్ని కోల్పోయాడు. భారత యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ సీరియస్‌ అయ్యాడు. అయితే  సర్ఫరాజ్‌ అగ్రహానికి కారణం లేకపోలేదు. అస్సలు ఏమి జరిగిందో ఓసారి పరిశీలిద్దాం.

కుల్దీప్‌ యాదవ్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్‌ ఖాన్‌.. జైశ్వాల్‌తో కలిసి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. టీ20 తరహాలో బౌండరీలు వర్షం కురిపించాడు. ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్‌ 94 ఓవర్‌ వేసిన రెహాన్ అహ్మద్‌ బౌలింగ్‌లో మూడో బంతిని సర్ఫరాజ్ డీప్ కవర్ మీదుగా షాట్ ఆడాడు. ఫీల్డర్‌ దూరంగా ఉండటంతో ఈజీగా రెండు పరుగులు సాధించవచ్చు. 

కానీ అప్పటికే 196 పరుగులతో డబుల్‌ సెంచరీకి చేరువలో ఉన్న జైశ్వాల్‌ రెండో పరుగుకు ఆసక్తి చూపలేదు. సర్ఫరాజ్ రెండో పరుగు కోసం పిచ్ సగం వరకు పరిగెత్తినా జైశ్వాల్‌ నిరాకరించాడు. వెంటనే సర్ఫరాజ్‌ వెనక్కి పరిగెత్తి నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌ వైపు చేరుకున్నాడు. దీంతో సర్ఫరాజ్ అసహనం వ్యక్తం చేశాడు. అక్కడ ఈజీగా రెండు పరుగులు తీయవచ్చని జైస్వాల్‌పై  అరిచాడు.

ఈ సమయంలో డ్రెసింగ్‌ రూమ్‌ నుంచి మ్యాచ్‌ను వీక్షిస్తున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం జైశ్వాల్‌ తీరును తప్పుబట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో జడేజా తప్పిదానికి సర్ఫరాజ్‌ రనౌట్‌ రూపంలో బలైన సంగతి తెలిసిందే. ఇక రాజ్‌కోట్‌ టెస్టులో 434 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. అదే విధంగా యశస్వీ జైశ్వాల్‌ సైతం అద్బుతమైన డబుల్‌ సెంచరీతో చెలరేగాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)