సర్ఫరాజ్‌ మెరుపు సెంచరీ.. 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో

Published on Tue, 12/02/2025 - 20:35

ఐపీఎల్‌-2025 మినీ వేలానికి ముందు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్‌, ముంబై స్టార్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న సర్ఫరాజ్‌.. మంగళవారం లక్నో వేదికగా అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టాడు.

దాదాపు రెండేళ్ల తర్వాత టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ తన తొలి మ్యాచ్‌లోనే విధ్వంసం సృష్టిం‍చాడు. కేవలం  47 బంతుల్లో తన తొలి టీ20 సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ ముంబైక‌ర్‌ స‌రిగ్గా వంద ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి.

సర్ఫరాజ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. అతడితో వెటరన్ అజింక్య రహానే 42 పరుగులతో రాణించాడు. కాగా గ‌త ఐపీఎల్ సీజ‌న్‌లో వేలం అన్‌సోల్డ్‌గా మిగిలిన స‌ర్ఫరాజ్ ఈసారి ఎలాగైనా ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఐదేసిన శార్థూల్‌..
ఇక 221 పరుగుల భారీ లక్ష్య చేధనలో అస్సాం జట్టు కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. ముంబై కెప్టెన్ శార్ధూల్ ఠాకూర్ ఐదు వికెట్లతో అస్సాం పతనాన్ని శాసించాడు. అతడితో పాటు అథర్వ అంకోలేకర్, సాయిరాజ్ పాటిల్ తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: క్రికెట్‌ ప్రపంచంలో తీవ్ర విషాదం.. రాబిన్‌ స్మిత్‌ హఠాన్మరణం
 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)