Breaking News

ముషీర్‌ ఖాన్‌కు బీసీసీఐ బంపరాఫర్‌.. టీమిండియాలో చోటు?

Published on Tue, 09/10/2024 - 12:17

ముంబై యువ బ్యాట‌ర్‌, భార‌త క్రికెట‌ర్ స‌ర్ఫ‌రాజ్ ఖాన్ సొద‌రుడు ముషీర్ ఖాన్ దేశీవాళీ క్రికెట్‌లో అద‌ర‌గొడుతున్నాడు.  ఈ ఏడాది రంజీ సీజ‌న్‌లో దుమ్ములేపిన ముషీర్ ఖాన్‌.. ఇప్పుడు మ‌రో దేశీవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో సైతం ఆక‌ట్టుకుంటున్నాడు.

ఈ టోర్నీలో ఇండియా-బి జట్టుకు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ముషీర్‌.. ఇండియా-ఎ టీమ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అద్బుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. 181 ప‌రుగులు చేసి తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

బీసీసీఐ బంపరాఫర్‌..
ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అదరగొడుతున్న ముషీర్ ఖాన్‌కు బీసీసీఐ బంపరాఫర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత-ఎ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్‌లో ప్రదర్శన ఆధారంగా ఆసీస్ పర్యటనకు భారత-ఎ జట్టును సెలక్టర్లు ఎంపిక చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో ముషీర్ ఖాన్‌పై భారత సెలక్టర్లు కన్నేసినట్లు తెలుస్తోంది. అతడిని భారత-ఎ జట్టుకు ఎంపిక చేయాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. అతడితో పాటు  రాజస్థాన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్‌ను సైతం ఆస్ట్రేలియాకు పంపాలని బీసీసీఐ యోచిస్తోందంట.

అదే విధంగా భారత-ఎ జట్టుతో పాటు ఇద్దరు టెస్టు స్పెషలిస్ట్‌లు, సీనియర్ జట్టుకు ఆడే పేస్ బౌలర్లను బీసీసీఐ ఆసీస్‌కు పంపనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఏడాది నవంబర్‌లో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది.
 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)