Breaking News

ఎంత పనిచేశావు రోహిత్‌? అంతా ధ్రువ్‌ వల్లే! పాపం సర్ఫరాజ్‌

Published on Thu, 03/07/2024 - 12:46

ధర్మశాల వేదికగా టీమిండియాతో జరగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జాక్‌ క్రాలే అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ క్రాలే మాత్రం తన దూకుడును కొనసాగించాడు. ఓవరాల్‌గా 108 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో క్రాలీ 79 పరుగులు చేశాడు. అయితే 61 పరుగుల వద్ద క్రాలే ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చేసిన తప్పిదం వల్ల క్రాలే బతికిపోయాడు.

ఏం జరిగిందంటే?
లంచ్‌ విరామం తర్వాత కుల్దీప్‌ యాదవ్‌ 26 ఓవర్‌ పూర్తి చేసేందుకు బౌలింగ్‌ ఎటాక్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో ఆ ఓవర్‌లో ఐదో బంతిని క్రాలే డౌన్‌ లెగ్‌ వైపు ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఎక్కువగా టర్న్‌ అయ్యి బ్యాట్‌, ప్యాడ్‌కు దగ్గరకు వెళ్తూ వికెట్‌ కీపర్‌ దిశగా వెళ్లింది. అయితే బంతిని ధ్రువ్‌ జురెల్‌ సరిగ్గా అందుకోవడంలో విఫలమయ్యాడు.

కానీ బంతి జురెల్‌ గ్లౌవ్‌కు తాకి కాస్త గాల్లోకి లేవగా.. షార్ట్‌ లెగ్‌లో ఉన్న సర్ఫరాజ్‌ ఖాన్‌ డైవ్‌ చేస్తూ అద్భుతంగా బంతిని అందుకున్నాడు. వెంటనే సర్ఫరాజ్‌తో పాటు భారత ఆటగాళ్లు క్యాచ్‌కు అప్పీల్‌ చేశారు. కానీ అంపైర్‌ మాత్రం నాటౌట్‌ అంటూ తల ఊపాడు. వెంటనే సర్ఫరాజ్‌ పూర్తి నమ్మకంతో రివ్యూ తీసుకోమని కెప్టెన్‌ రోహిత్‌ శర్మను సూచించాడు.

రోహిత్‌ మాత్రం వికెట్‌ కీపక్‌ ధ్రువ్‌ జురెల్‌ సలహా తీసుకున్నాడు. జురెల్‌ బంతి బ్యాట్‌కు కాకుండా ప్యాడ్‌కు తాకిందని చెప్పడంతో రోహిత్‌ రివ్యూకు వెళ్లలేదు. కానీ తర్వాత రిప్లేలో మాత్రం బంతి క్లియర్‌గా బ్యాట్‌కు తాకినట్లు కన్పించింది. ఇది చూసిన రోహిత్‌ ఎంత పనిపోయిందని అన్నట్లు నవ్వుతూ రియాక్షన్‌ ఇచ్చాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ కూడా నేను చెప్పా కదా భయ్యా అన్నట్లు సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)