Breaking News

అతడు ప్రపంచకప్‌కు రెడీ.. సిక్సర్ల వర్షం కురిపిస్తాడు! వారిద్దరూ వద్దు..

Published on Thu, 08/03/2023 - 10:52

వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా కొన్ని ప్రయోగాలు చేసిన సంగతి తెలిసిందే. ఆఖరి రెండు మ్యాచ్‌లకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లికి జట్టు మెనెజ్‌మెంట్‌ విశ్రాంతి ఇచ్చింది. వారి స్దానంలో యువ ఆటగాళ్లకు అవకాశం లభించింది. కొంతమెరకు టీమిండియా చేసిన ప్రయోగాలు ఫలించాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా సంజూ శాంసన్‌ వంటి ఆటగాడికి వరల్డ్‌కప్‌ ముందు తన సత్తా నిరూపించుకోవడానికి సువర్ణవకాశం దక్కింది.

రెండో వన్డేలో విఫలమైన సంజూ.. నిర్ణయాత్మక మూడో వన్డేలో మాత్రం కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌ వచ్చి 41 బంతుల్లో 51 పరుగులతో భారత్‌ భారీ స్కోర్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతడిని భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు. ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్‌ మహ్మద్ కైఫ్ చేరాడు. ఈ ఏడాది జరగనున్న వరల్డ్‌కప్‌ సంజూ శాంసన్ సిద్ధంగా ఉన్నాడని కైఫ్‌ అభిప్రాయపడ్డాడు.

సంజూ రెడీ..
"విండీస్‌తో ఆఖరి మ్యాచ్‌లో శాంసన్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడి ఆట తీరు నన్ను ఎంతో గానే అకట్టుకుంది. సంజూకు నాలుగు లేదా ఐదో స్ధానంలో బ్యాటింగ్‌ చేసే సత్తా ఉంది. అతడు గతంలో కూడా ఇదే బ్యాటింగ్‌ పొజిషేన్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ మిడిలార్డర్‌లో కిషన్‌ లేదా అక్షర్‌ పటేల్‌ను బ్యాటింగ్‌కు పంపాలనుకోవడం సరైన నిర్ణయం కాదు.

మిడిలార్డర్‌లో లెగ్‌ స్పిన్‌, లెఫ్ట్‌ఆర్మ్‌ స్పిన్‌కు బాగా ఆడే ఆటగాడు కావాలి. ఆ పని సంజూ చేయగలడు. సంజూ స్పిన్నర్ల బౌలింగ్‌లో సిక్సర్ల వర్షం కురిపించగలడు. కాబట్టి అతడిని కచ్చితంగా వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలి. సంజూ కూడా సిద్దంగా ఉన్నాడని అమృత్ మాథుర్ పుస్తకం 'పిచ్‌సైడ్' ఆవిష్కరణ కార్యక్రమంలో కైఫ్‌ పేర్కొన్నాడు. ఇక గురువారం నుంచి విండీస్‌తో మొదలు కానున్న టీ20 సిరీస్‌లో కూడా సత్తా చాటేందుకు సంజూ సిద్దమయ్యాడు.
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో తొలి టీ20.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా కెప్టెన్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)