Breaking News

అభిమానుల కోసమే.. హైదరాబాద్‌లో ఫేర్‌వెల్‌ మ్యాచ్‌

Published on Sat, 03/04/2023 - 17:42

మహిళా టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఇటీవలే ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. గత నెలలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ సందర్భంగా రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించిన సానియా చివరగా దుబాయ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ ఆడింది. ఆ టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఓడిపోయిన సానియా కెరీర్‌కు వీడ్కోలు పలికింది. 

అయితే సానియా మీర్జా పుట్టింది ముంబైలో అయినా పెరిగింది మాత్రం హైదరాబాద్‌లో అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హైదరాబాద్‌లోనే కెరీర్‌ను ప్రారంభించిన సానియా దేశం తరపున మహిళల టెన్నిస్‌లో అత్యున్నత శిఖరానికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే తాను పెరిగిన హైదరాబాద్‌లో సానియా చివరి మ్యాచ్‌ ఆడాలని భావించింది.

అందుకే రేపు హైదరాబాద్‌లో ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ ఆడనున్నట్లు సానియా మీర్జా మీడియా సమావేశంలో తెలిపింది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సానియా మీడియాతో మాట్లాడుతూ.. ''అభిమానుల కోసం రేపు చివ‌రి మ్యాచ్ ఆడుతున్నా. విశేషం ఏంటంటే.. 20 ఏళ్ల క్రితం నేను ఎక్క‌డ టెన్నిస్ సాధ‌న చేశానో అక్క‌డే ఆఖ‌రి మ్యాచ్ ఆడునున్నా. ఈ మ్యాచ్ చూసేందుకు నా కుటుంబం, స్నేహితులు వ‌స్తున్నారు. కెరీర్‌లో చివ‌రి మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎద‌రు చూస్తున్నా. విజ‌యంతో కెరీర్‌ను ముగించాలని అనుకుంటున్నా'' అని సానియా వెల్లడించింది. అంతేకాదు త‌న కుమారుడు, కుటుంబంతో స‌మ‌యం కేటాయిస్తాన‌ని ఈ టెన్నిస్ దిగ్గ‌జం చెప్పుకొచ్చింది.

ఇక ఎల్బీ స్టేడియంలో రేపు సానియా రెండు మ్యాచ్‌లు ఆడ‌నుంది. సానియా, రోహ‌న్ బోప‌న్న టీమ్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. డ‌బుల్స్‌లో సానియా – బోప‌న్న జోడీ ఇవాన్ డోడిగ్ – మ్యాటెక్ సాండ్స్ జంట‌ను ఢీ కొట్ట‌నుంది. సానియా చివ‌రి సారి ఆడ‌నున్న ఈ రెండు మ్యాచ్‌లు చూసేందుకు చాలామంది బాలీవుడ్, టాలీవుడ్ ప్ర‌ముఖులు త‌ర‌లి రానున్నారు. 

తన 20 ఏళ్ల ప్రొఫెషనల్‌ కెరీర్‌లో సానియా ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో కలిపి మొత్తం 43 డబ్ల్యూటీఏ టైటిల్స్‌ సాధించింది. 91 వారాలు డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ గేమ్స్‌లో  పతకాలు సాధించింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్‌ రత్న’... ‘అర్జున అవార్డు’... పౌర పురస్కారాలు ‘పద్మభూషణ్‌’, ‘పద్మశ్రీ’ అందుకుంది. వచ్చే నెలలో సానియా మీర్జా కొత్త పాత్రలో కనిపించనుంది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ టి20 క్రికెట్‌ టోర్నీలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు సానియా ‘మెంటార్‌’గా వ్యవహరించనుంది. 

చదవండి: WPL 2023: మ్యాచ్‌ 30 నిమిషాలు ఆలస్యంగా..

రిఫరీపై ఆటగాళ్ల మూకుమ్మడి దాడి

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)