Breaking News

షోయబ్‌తో విడాకులు.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన సానియా మీర్జా

Published on Thu, 11/13/2025 - 11:30

భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza) తన వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ తెలియని కొత్త విషయాలను బహిర్గతం​ చేసింది. తాను కొత్తగా ప్రారంభించిన ‘Serving It Up With Sania’ అనే యూట్యూబ్ ‌షోలో మాట్లాడుతూ.. పాకిస్తానీ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌తో విడాకుల అనంతరం ఎదుర్కొన్న మానసిక ఒత్తిడిని గురించి ప్రస్తావించింది. 

ఈ ఎపిసోడ్‌లో బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్‌ (Farah Khan) అతిథిగా పాల్గొంది. ఫరా సానియాకు మంచి మిత్రురాలు. ఈ షోలో సానియా-ఫరా మధ్య జరిగిన సంభాషణ ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. షోయబ్‌తో విడాకుల తర్వాత భయానక పరిస్థితుల్లో గడుపుతున్న తనకు ఫరా అండగా నిలిచిందని సానియా చెప్పుకొచ్చింది. ఆ క్షణాలు తన జీవితంలో అత్యంత భావోద్వేగభరితమైనవిగా గుర్తు చేసుకుంది.

సానియా ఫరాతో మాట్లాడుతూ ఇలా అంది. ఆ రోజు నేను పూర్తిగా కూలిపోయే స్థితిలో ఉన్నాను. నువ్వు రాకపోతే నేను ఆ లైవ్ షో చేయలేకపోయేదాన్ని. ఆ సమయంలో నేను వణికిపోతున్నాను. నువ్వు వచ్చి ‘ఏమైపోయినా ఈ షో చేయాలి’ అని చెప్పినప్పుడు నాకు బలం వచ్చిందంటూ సానియా తీవ్రమైన భావోద్వేగానికి లోనైంది.

ఫరా కూడా ఆ రోజు గుర్తు చేసుకుంటూ ఇలా అంది. నిన్ను అలా చూసి భయపడ్డాను. నాకు ఆ రోజు షూట్ ఉండింది. కానీ అన్నీ వదిలేసి ఇంట్లో వేసుకున్న దుస్తులతోనే అక్కడికి వచ్చేశాను. ఆ సమయంలో నీకు తోడుగా ఉండాలనిపించిందని చెప్పింది.

ఈ షో సందర్భంగా ఫరా సానియాపై ప్రశంసల వర్షం కురిపించింది. విడాకుల తర్వాత సానియా సింగిల్‌ పేరెంట్‌గా తన కుమారుడు ఇజ్హాన్‌ను తీర్చిదిద్దుతున్న తీరు ఆకట్టుకుందని తెలిపింది. వ్యక్తిగత జీవతంలో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ, కెరీర్‌ను బ్యాలెన్స్‌ చేసుకోవడంతో పాటు ఇజ్హాన్‌కు సమయం కేటాయించగలిగావని ప్రశంసించింది.

కాగా, సానియా–షోయబ్‌ల వివాహం 2010లో జరిగింది. 2018లో వారికి ఇజ్హాన్ జన్మించాడు. 2024 జనవరిలో షోయబ్ మాలిక్‌ పాకిస్తానీ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించగా, సానియా కుటుంబం అప్పటికే షోయబ్‌తో విడాకులు అయిపోయాయని వెల్లడించింది.

చదవండి: ఐపీఎల్‌లో జరిగిన ట్రేడ్‌ డీల్స్‌ ఇవే..!

 

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)