Breaking News

సందీప్ శ‌ర్మ అత్యంత చెత్త రికార్డు.. 18 ఏళ్ల ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే

Published on Thu, 04/17/2025 - 13:27

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ స్టార్ పేస‌ర్ సందీప్ శ‌ర్మ (Sandeep Sharma) అత్యంత చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఆఖ‌రి ఓవ‌ర్‌లో అత్యధిక బంతులు విసిరిన బౌల‌ర్‌గా సందీప్ నిలిచాడు. ఐపీఎల్‌-2025లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో శ‌ర్మ ఈ చెత్త రికార్డును నెల‌కొల్పాడు.

ఈ మ్యాచ్‌లో ఆఖ‌రి ఓవ‌ర్ బౌలింగ్ చేసిన సందీప్ ఏకంగా 11 బంతులు విసిరాడు. ఆ ఓవ‌ర్‌లో సందీప్ నాలుగు వైడ్లు, ఓ నోబాల్ వేయ‌డం గ‌మ‌నార్హం. ఆఖ‌రి ఓవ‌ర్‌లో శ‌ర్మ మొత్తంగా 19 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ఓవ‌రాల్‌గా ఈ చెత్త రికార్డు సాధించిన నాలుగో బౌల‌ర్‌గా సందీప్ నిలిచాడు. 

సందీప్ కంటే ముందు మ‌హ్మ‌ద్ సిరాజ్‌, తుషార్ దేశ్ పాండే, శార్ధూల్ ఠాకూర్ 11 బంత‌లు ఒకే ఓవ‌ర్‌లో వేశారు. అయితే ఈ ముగ్గురు ఆఖ‌రి ఓవ‌ర్ కాకుండా వేర్వేరు ఓవ‌ర్ల‌ల్లో 11 బంతులు విసిరారు.

ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక బంతులు విసిరిన బౌల‌ర్లు..
👉11 బంతులు మొహమ్మద్ సిరాజ్ vs ముంబై ఇండియ‌న్స్‌ 2023 (ఓవర్ 19)
👉11 బంతులు తుషార్ దేశ్‌పాండే vs ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ 2023 (ఓవర్ 4)
👉11 బంతులు శార్దూల్ ఠాకూర్ vs కేకేఆర్‌ 2025 (ఓవర్ 13)
👉11 బంతులు సందీప్ శర్మ vs ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ 2025 (ఓవర్ 20)

కాగా చివర వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఈ మ్యాచ్ ఫలితం సూప‌ర్ ఓవ‌ర్‌లో తేలింది. సూప‌ర్ ఓవ‌ర్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యం సాధించింది. అయితే సూప‌ర్ ఓవ‌ర్‌లో కూడా సందీప్ శ‌ర్మ‌నే బౌలింగ్ చేయ‌డం గ‌మ‌నార్హం. 12 ప‌రుగుల టార్గెట్‌ను సందీప్ డిఫెండ్ చేసుకోలేక‌పోయాడు.
చ‌ద‌వండి: 'మ‌రీ అంత స్వార్ధం ప‌నికిరాదు బ్రో.. నీ వ‌ల్లే రాజ‌స్తాన్ ఓడిపోయింది'
 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు