Breaking News

అప్పట్లో ఒకడుండేవాడు.. ఇప్పుడు తిలక్‌ వర్మ!: మాజీ క్రికెటర్‌

Published on Mon, 01/27/2025 - 14:34

టీమిండియా యువ సంచలనం తిలక్‌ వర్మ(Tilak Varma) ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ తెలుగు తేజం.. ఇప్పటికే రెండు శతకాలు సాధించాడు. కష్టతరమైన సౌతాఫ్రికా పిచ్‌లపై వరుస సెంచరీలతో చెలరేగిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌(India vs England)లోనూ అదరగొడుతున్నాడు.

స్వదేశంలో ఇంగ్లిష్‌ జట్టుతో కోల్‌కతాలో జరిగిన తొలి టీ20లో 19 పరుగులతో అజేయంగా నిలిచిన తిలక్‌ వర్మ.. ఫోర్‌ బాది జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఇక చెన్నైలో జరిగిన రెండో టీ20లో ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమైన చోట.. తాను మాత్రం బ్యాట్‌ ఝులిపించాడు.

సూపర్‌ ఫినిషింగ్‌ టచ్‌
ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఫోర్‌ బాది జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. మొత్తంగా 55 బంతులు ఎదుర్కొని 72 పరుగులతో అజేయంగా నిలిచిన తిలక్‌ వర్మ ఇన్నింగ్స్‌లో.. నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉండటం విశేషం. ఈ రెండు సందర్బాల్లోనూ 22 ఏళ్ల ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ తనదైన శైలిలో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చి టీమిండియాను గెలిపించడం విశేషం.

ఈ నేపథ్యంలో తిలక్‌ వర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ తిలక్‌ను ఏకంగా మహేంద్ర సింగ్‌ ధోని(MS Dhoni)తో పోలుస్తూ ఆకాశానికెత్తడం విశేషం. ‘‘ఆఖరి వరకు అతడి ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. పద్దెమినిదవ ఓవర్లోనూ ఏమాత్రం భయపడలేదు.

తిలక్‌ వర్మ అచ్చం  ఆ దిగ్గజం మాదిరే
అంతెందుకు పందొమ్మిదవ ఓవర్లో టీమిండియాకు ఒక్క బౌండరీ కూడా రాలేదు. అప్పుడూ అతడు ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా.. ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. ఫోర్‌తో ఫినిష్‌ చేశాడు. అతడు ఆత్మవిశ్వాసంతో ఉండటంతో పాటు జట్టును కూడా కాన్ఫిడెంట్‌గా ఉంచుతున్నాడు.

ధోని కంటే కాస్త మెరుగే
గతంలో మనకు ఇలాంటి దిగ్గజం ఒకరు ఉండేవారు. అతడు మరెవరో కాదు మహేంద్ర సింగ్‌ ధోని. తను కూడా ఇలాగే ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్‌ ముగించేవాడు. అతడిలాంటి వ్యక్తి.. అది కూడా మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తూ.. ఇలాంటి ఫలితాలు రాబట్టడం మామూలు విషయం కాదు’’ అని సంజయ్‌ మంజ్రేకర్‌ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో టైమ్‌అవుట్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

కాగా తిలక్‌ వర్మ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 22 టీ20 మ్యాచ్‌లు ఆడి 156కు పైగా స్ట్రేక్‌రేటుతో 707 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో రెండు శతకాలు, మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 120. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా రెండు గెలిచింది. 

ఆధిక్యంలో టీమిండియా
తొలి టీ20లో ఏడు వికె ట్ల తేడాతో విజయం సాధించిన సూర్యకుమార్‌ సేన.. రెండో మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తద్వారా ప్రస్తుతం 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇక ఇండియా- ఇంగ్లండ్‌ మధ్య మంగళవారం రాజ్‌కోట్‌లో మూడో టీ20 జరుగనుంది. తదుపరి పుణె, ముంబైలలో మిగిలిన టీ20లు జరుగుతాయి.

చదవండి: చాంపియన్స్‌ ట్రోఫీ జట్టులోకి సిరాజ్‌! కారణం ఇదే!

Videos

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)