Breaking News

ఆసియాక‌ప్‌లో అట్ట‌ర్ ప్లాప్‌.. పాక్ కెప్టెన్‌పై వేటు!?

Published on Tue, 10/07/2025 - 17:00

ఆసియాక‌ప్‌-2025 ర‌న్న‌ర‌ప్‌గా పాకిస్తాన్ నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ టోర్నీలో పాక్ జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరిన‌ప్ప‌టికి త‌మ స్ధాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంలో మాత్రం విఫ‌ల‌మైంది. భార‌త్‌పై ఆడిన మూడు మ్యాచ్‌ల‌లోనూ పాక్ చిత్తు అయింది.

ముఖ్యంగా కెప్టెన్ స‌ల్మాన్ అఘా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకోలేక‌పోయాడు. ఈ మెగా ఈవెంట్‌లో స‌ల్మాన్ బ్యాట‌ర్‌గా లీడ‌ర్‌గా తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. ఈ ఖండాంత‌ర టోర్నీలో 7 మ్యాచ్‌లు ఆడిన అఘా.. 12 స‌గ‌టుతో 72 ప‌రుగులు చేశాడు.

ఆఖ‌రికి ఒమ‌న్, యూఏఈ వంటి ప‌సికూన‌ల‌పై కూడా అత‌డు రాణించ‌లేకపోయాడు. అత‌డి ప్ర‌ద‌ర్శ‌ల‌న‌పై పీసీబీ అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది.  సెల‌క్ట‌ర్లు, హెడ్ కోచ్ మైక్ హుస్సేన్ అత‌డికి స‌పోర్ట్‌గా ఉన్న‌ప్ప‌టికి పాక్ క్రికెట్ బోర్డు పెద్ద‌లు మాత్రం గుర్రుగా ఉన్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. 

పాక్ జ‌ట్టు ఈ నెల‌ఖారున‌ ద‌క్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఈ సిరీస్‌లో కూడా అత‌డు విఫ‌ల‌మైతే కెప్టెన్సీతో పాటు జ‌ట్టు నుంచి కూడా తొలిగించే అవ‌కాశ‌ముంది.

కెప్టెన్‌ల మార్పు పాక్‌కు కొత్తేమి కాదు. టీ20ల్లో బ్యాట‌ర్‌గా కూడా స‌ల్మాన్‌కు మంచి రికార్డు ఏమి లేదు. ఇప్ప‌టివ‌ర‌కు 32 మ్యాచ్‌ల్లో అత‌డు 110 స్ట్రైక్ రేట్‌తో 561 పరుగులు మాత్రమే చేశాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు పాక్‌ జట్టులోకి సీనియర్లు రిజ్వాన్‌, బాబర్‌ ఆజం రానున్నట్లు తెలుస్తోంది.

ఆసియాకప్‌నకు వీరిద్దరిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో సెలక్టర్లపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే వారిద్దరికి తిరిగి పిలుపునవ్వాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
చదవండి: భారత్‌-పాక్‌ మ్యాచ్‌లు వద్దు.. అందుకు వారు ఒప్పుకొంటారా?: బీసీసీఐ
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)