Breaking News

స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాడి మహోగ్రరూపం.. 7 ఫోర్లు, 10 సిక్స్‌ల‌తో విధ్వంసం

Published on Sun, 09/13/2026 - 09:14

షేర్-ఈ-పంజాబ్ టీ20 లీగ్‌లో లూధియానా లయన్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం మొహాలీ స్టేడియం వేదికగా జరిగిన రెండో సెమీఫైన‌ల్లో జలంధర్ వారియర్స్‌పై 17 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన లూథియనా.. తొలిసారి తుది పోరుకు అర్హ‌త సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యువ ఆటగాడు, లూథియానా కెప్టెన్‌ సైల్‌ ఆరోరా విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. 

ఈ క్రమంలో ఆరోరా కేవలం 50 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 56 బంతులు ఎదుర్కొన్న ఆరోరా 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 120 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు మాధవ్‌ సింగ్‌(22 బంతుల్లో 42) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

బాస్కర్ మ్యాజిక్‌
అనంతరం లక్ష్య చేధనలో జలంధర్ వారియర్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది.  జలంధర్ కెప్టెన్ ప్రభ్‌సిమ్రన్ సింగ్( 35 బంతుల్లో 63 పరుగులు) హాఫ్ సెంచరీ సాధించినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. రైట్‌ ఆర్మ్‌ పేసర్‌ సాహిల్‌ బాస్కర్‌ బంతితో మ్యాజిక్‌ చేశాడు. బాస్కర్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 16 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. క‌ట్ చేస్తే! వెస్టిండీస్‌లో?


 

 

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)