Breaking News

చెలరేగిన సజన.. ఆర్సీబీ టార్గెట్‌ ఎంతంటే?

Published on Fri, 01/09/2026 - 21:47

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా తొలి మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ముంబై ఇండియన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ మంధాన ముంబైని బ్యాటింగ్‌కు అహ్హనించింది. అయితే తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు శుభారంభం లభించలేదు.

ముంబై జట్టు 11 ఓవ‌ర్ల‌లో 67 ప‌రుగుల‌కే 4 కీల‌క వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.  ఈ స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన సజీవన్ సజన విధ్వంసం సృష్టించింది. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడింది. మొత్తంగా 25 బంతులు ఎదుర్కొన్న సజన.. 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45 పరుగులు చేసింది.

ఆమెతో పాటు నికోలా కారీ(40) కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. ఫలితంగా ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో నాడిన్ డి క్లెర్క్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. లారెన్‌ బెల్‌, శ్రేయంకా పాటిల్‌ తలా వికెట్‌ సాధించారు.

అయితే ముంబై ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన సజన రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచే తప్పించుకుంది. రెండు సునాయస క్యాచ్‌లను ఆర్సీబీ ఫీల్డర్లు జారవిడిచారు. అందుకు ఆర్సీబీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
చదవండి: T20 WC 2026: భారత్‌లో ఆడబోము..! బంగ్లా డిమాండ్‌పై స్పందించిన బీసీసీఐ
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)