Breaking News

సౌతాఫ్రికాను చిత్తు చేసిన పాకిస్తాన్‌

Published on Sat, 11/08/2025 - 21:22

ఫైసలాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో పాక్‌ సొంతం చేసుకుంది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ను పాకిస్తాన్ కైవం చేసుకోవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ప్రోటీస్ జట్టుతో జరిగిన ఐదు వన్డే సిరీస్‌లలో పాక్‌కు ఇది నాలుగో విజయం.

అబ్రార్‌ మ్యాజిక్‌..
ఇక నిర్ణయాత్మక వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 37.5 ఓవర్లలో కేవలం 143 పరుగులకే కుప్పకూలింది. పాక్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ సంచలన ప్రదర్శన కనబరిచాడు. అహ్మద్‌ తన పది ఓవర్ల కోటాలో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు కెప్టెన్‌ షాహీన్‌ అఫ్రిది, సల్మాన్‌ అఘా, మహ్మద్‌ నవాజ్‌ తలా రెండు వికెట్లు సాధించారు.

ప్రోటీస్‌ బ్యాటర్లలో ఓపెనర్లు క్వింటన్ డి కాక్ (72), ప్రిటోరియస్ (57) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం 144 పరుగుల లక్ష్యాన్ని పాక్‌ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 25.1 ఓవర్లలో చేధించింది. పాక్‌ ఓపెనర్‌ సైమ్‌ అయూబ్‌(77) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కాగా అంతకుముందు టీ20 సిరీస్‌ను కూడా 2-1 తేడాతో పాక్‌ కైవసం చేసుకుంది.
చదవండి: టీమిండియా వైపు దూసుకొస్తున్న పేస్ గుర్రం

Videos

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)