Breaking News

మూడో టీ20లో అఫ్గాన్‌ చిత్తు.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్‌

Published on Mon, 10/06/2025 - 09:18

షార్జా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో బంగ్లా జట్టు క్లీన్ స్వీప్ చేసింది. నామమాత్రపు మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది.

అఫ్గాన్‌ బ్యాటర్లలో దర్విష్ రసూలి(32) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. అటల్‌(28), ముజీబ్‌(23) పర్వాలేదన్పించారు. మిగితా బ్యాటర్లంతా దారుణ ప్రదర్శన కనబరిచారు. సిరీస్‌ అంతటా అఫ్గాన్‌ బ్యాటర్లు తమ స్ధాయికి తగ్గట్టు రాణించలేకపోయారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో సైఫుద్దీన్‌ మూడు వికెట్లతో సత్తాచాటగా.. తంజిమ్ హసన్ సాకిబ్, నసీం అహ్మద్‌ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు షోర్‌ఫుల్‌ ఇస్లాం, రిషాద్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

సైఫ్ మెరుపు హాఫ్‌ సెంచరీ..
అనంతరం 145 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా టైగర్స్‌ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. సైఫ్‌ హసన్‌(38 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 64 నాటౌట్‌) అద్భుతమైన హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు.

అతడితో పాటు తంజీద్‌ 33 పరుగులతో రాణించాడు. అఫ్గాన్‌ బౌలర్లలో ముజీబ్‌ రెండు, ఓమర్జాయ్‌ అబ్దుల్లా తలా వికెట్‌ సాధించారు. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: Abhishek Sharma: ఆసీస్‌పై అభిషేక్ మ‌ళ్లీ ఫెయిల్‌.. ఇలా అయితే క‌ష్ట‌మే?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)