Breaking News

రోహిత్ శర్మ స్థానంలో యువ సంచ‌ల‌నం..? ఇక భార‌త్‌కు తిరుగులేదు?

Published on Sun, 05/11/2025 - 16:05

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భార‌త క్రికెట్ జ‌ట్టు ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఇప్ప‌టికే రోహిత్ శ‌ర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించి అంద‌రికి షాకివ్వ‌గా.. హిట్‌మ్యాన్ బాట‌లోనే స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి న‌డుస్తున్న‌ట్లు తెలుస్తోంది. టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాల‌ని కోహ్లి నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

విరాట్ త‌న నిర్ణ‌యాన్ని ఇప్ప‌టికే బీసీసీఐకి తెలియ‌జేసిన‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అయితే ఇంగ్లండ్ సిరీస్ వ‌ర‌కు అయినా కొన‌సాగాల‌ని కోహ్లిని ఒప్పించేందుకు బీసీసీఐ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు వినికిడి. కోహ్లి టెస్టుల్లో కొన‌సాగుతాడా లేదా రోహిత్ బాట‌లోనే న‌డుస్తాడా? అన్న‌ది మే 23న తేలిపోనుంది. 

ఆ రోజున ఇంగ్లండ్ టూర్‌కు భార‌త జ‌ట్టుతో పాటు కొత్త కెప్టెన్‌ను కూడా బీసీసీఐ ప్ర‌క‌టించ‌నుంది. కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్ ఎంపిక దాదాపు ఖాయం కాగా.. ప్లేయ‌ర్‌గా  రోహిత్ శ‌ర్మ స్దానాన్నిమాత్రం త‌మిళ‌నాడు యువ సంచ‌ల‌నం సాయిసుద‌ర్శ‌న్‌తో భ‌ర్తీ చేయాల‌ని బీసీసీఐ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. సాయిసుద‌ర్శ‌న్ ప్ర‌స్తుతం అద్బుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. 

ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దుమ్ములేపుతున్నాడు. ఐపీఎల్‌-2025లో గుజ‌రాత్ టైటాన్స్ త‌ర‌పున ఆడుతున్న సుద‌ర్శ‌న్ ప‌రుగులు వ‌ర‌ద పారిస్తున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 5 హాఫ్ సెంచరీలతో 509 పరుగులు చేశాడు. అత‌డి ఆట‌ను చూసి మాజీలు ఫిదా అయిపోయారు. ర‌విశాస్రి వంటి దిగ్గ‌జ క్రికెట‌ర్లు సుద‌ర్శ‌న్‌ను ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేయాల‌ని సెల‌క్ట‌ర్ల‌ను సూచించారు.

దీంతో భార‌త త‌ర‌పున వ‌న్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిన సుద‌ర్శ‌న్‌.. ఇప్పుడు టెస్టుల్లో ఆడేందుకు సిద్ద‌మ‌య్యాడు. సుద‌ర్శ‌న్‌కు ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. రంజీ ట్రోఫీ సీజ‌న్ల‌లో త‌మిళ‌నాడు త‌ర‌పున ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 7 సెంచరీలతో 1957 పరుగులు చేశాడు. 

సుద‌ర్శ‌న్ అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ 213గా ఉంది. భారత్ తరుపున ఆడిన 3 వన్డేలలో 2 అర్ధ సెంచరీలతో 127 పరుగులు చేశాడు. అదేవిధంగా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభ‌వం కూడా అత‌డికి ఉంది. ఈ క్ర‌మంలో రోహిత్ శర్మ స్థాన్నాన్ని సుదర్శన్‌తో భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూన్ 20 నుంచి భార‌త జ‌ట్టు ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న ప్రారంభం కానుంది.
చ‌ద‌వండి: IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌..!
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)