సాయి సుదర్శన్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌..5 మ్యాచ్‌ల్లో నాలుగు హాఫ్‌ సెంచరీలు

Published on Sun, 06/25/2023 - 17:48

ఐపీఎల్‌-2023లో దుమ్మురేపిన గుజరాత్‌ టైటాన్స్‌ యువ ఆటగాడు సాయి సుదర్శన్‌.. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో అదే దూకుడును కనబరుస్తున్నాడు. ఈ లీగ్‌లో లైకా కోవై కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సాయిసుదర్శన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. తాజాగా దిండిగల్ డ్రాగన్స్‌తో మ్యాచ్‌లో సుదర్శన్‌ మరో అద్భుత హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు.

ఇది ఈ లీగ్‌లో సాయికి నాలుగో హాఫ్‌ సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 41 బంతులు ఎదుర్కొన్న సుదర్శన్‌ 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. అతడు అద్భుత ఇన్నింగ్స్‌ ఫలితం‍గా లైకా కోవై కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్‌ 110 సగటుతో 323  పరుగులు చేశాడు.

అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా సాయి సుదర్శన్‌ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు.  ఫైనల్‌లో 47 బంతుల్లో 96 పరుగులు చేసి, గుజరాత్ టైటాన్స్‌కి భారీ స్కోరు అందించాడు. ఈ ఏడాది సీజన్‌లో కేవలం 8 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సాయి 50 పైగా సగటుతో 362 పరుగులు సాధించాడు.  ఇక సూపర్‌ ఫామ్‌లో ఉన్న సాయి సుదర్శన్‌ త్వరలో వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్‌ ఉంది.
చదవండి: World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి ఐసీసీ కీలక అప్‌డేట్‌

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)