Breaking News

IND vs WI 2nd Test: టీమిండియాకు భారీ షాక్‌..

Published on Sat, 10/11/2025 - 14:59

ఢిల్లీ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో టీమిండియా (Teamindia) కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. యువ ఆట‌గాడు సాయి సుద‌ర్శ‌న్‌(Sai Sudharsan)కు గాయ‌ప‌డ్డాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్ సంద‌ర్భంగా షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తుండ‌గా సుద‌ర్శ‌న్ చేతి వేలికి బంతి బ‌లంగా తాకింది.

7 ఓవ‌ర్ వేసిన ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్‌లో రెండో బంతిని జాన్ క్యాంప్‌బెల్‌కు ఔట్‌సైడ్ ఆఫ్ దిశ‌గా సంధించాడు. ఆ బంతిని క్యాంప్‌బెల్ స్లాగ్ స్వీప్ ఆడాడు. షాట్ క‌న‌క్ట్ అయిన‌ప్ప‌టికి బంతి షార్ట్ లెగ్‌లో ఉన్న సుద‌ర్శ‌న్ చేతిలోకి వెళ్లింది. బంతి చేతికి బ‌లంగా తాకిన‌ప్ప‌టికి సుద‌ర్శ‌న్ మాత్రం అద్భుత‌మైన క్యాచ్‌ను అందుకున్నాడు. 

ఆ క్యాచ్ చూసి బ్యాటర్‌తో పాటు మైదానంలో ఉన్న అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే బంతిని అందుకునే క్ర‌మంలో అత‌డి చిటికెన వేలుకు గాయ‌మైంది. దీంతో నొప్పితో అత‌డు విల్ల‌విల్లాడు. ఫిజియో వ‌చ్చి చికిత్స అందించిన‌ప్ప‌టికి అత‌డు నొప్పి త‌గ‌లేదు.

ఆఖ‌రికి ఫిజియో సాయంతో అత‌డు మైదానాన్ని వీడాడు. అత‌డి గాయం తీవ్ర‌త తెలియాల్సి ఉంది. సుదర్శన్‌ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్‌ చరిత్రలోనే సూపర్‌ క్యాచ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

టీమిండియా భారీ స్కోర్‌..
ఇక తొలి ఇన్నింగ్స్‌లో భార‌త జ‌ట్టు భారీ స్కోర్ సాధించింది. రెండో రోజు ఆటలో ఐదు వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో య‌శస్వి జైశ్వాల్‌(175), శుబ్‌మ‌న్ గిల్‌(129 నాటౌట్‌) అద్బుత సెంచ‌రీల‌తో చెల‌రేగారు. సుదర్శన్‌(87, జురెల్ (44) ఔట్, నితీష్‌(43), రాహుల్‌(38) రాణించారు. ఇక వెస్టిండీస్ బౌలర్లలో వారికన్ ఒక్కడే మూడు వికెట్లు తీశాడు. రోస్టన్ ఛేజ్ మరో వికెట్ పడగొట్టాడు.
చదవండి: శతక్కొట్టి.. చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌


 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)