అంధుల మహిళల క్రికెట్‌ జట్టుకు సచిన్‌ అభినందన

Published on Thu, 12/18/2025 - 03:03

ముంబై: అంధుల మహిళల టి20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టును క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అభినందించాడు. తొలిసారి నిర్వహించిన ఈ మెగాటోర్నీలో భారత జట్టు అజేయంగా ట్రోఫీ చేజిక్కించుకుంది. తాజాగా వరల్డ్‌కప్‌ నెగ్గిన భారత జట్టు... మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సచిన్‌ను కలిసింది. ఈ సందర్భంగా ప్రపంచకప్‌లో మన అమ్మాయిలు చూపిన ప్రతిభాపాటవాలను మాస్టర్‌ బ్లాస్టర్‌ కొనియాడాడని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. 

‘కఠోర శ్రమ, అకుంఠిత దీక్షతోనే మన జట్టు ప్రపంచకప్‌ గెలిచింది. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు కూడా ఇదే నిలకడ కొనసాగిస్తూ... మరిన్ని విజయాలు సాధించాలి. ఈ విజయం అందరి బాధ్యతను మరింత పెంచింది. ప్రపంచ కప్‌ ట్రోఫీ ఎంతో మందిలో స్ఫూర్తి నింపింది’ అని సచిన్‌ పేర్కొన్నాడని నిర్వాహకులు తెలిపారు.

వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టు కెపె్టన్‌ దీపిక మాట్లాడుతూ... ‘సచిన్‌ మాటలు మాకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. మేము మైదానంలోకి దిగిన ప్రతిసారీ ఎంతో అంకితభావం, ఆత్మవిశ్వాసంతో ఆడాం. దానికి తగ్గ ప్రతిఫలం వరల్డ్‌ కప్‌ రూపంలో దక్కింది. సచిన్‌ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వినడంతో మా మనసు ఉప్పొంగుతోంది’ అని దీపిక పేర్కొంది.  

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)