Breaking News

సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలంలో గంగూలీ మార్క్‌..

Published on Tue, 09/09/2025 - 21:33

టీమిండియా దిగ్గ‌జం సౌర‌వ్ గంగూలీ.. ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా త‌న ప‌నని మొద‌లు పెట్టాడు. జోహన్నెస్‌బర్గ్ వేదిక‌గా జ‌రుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్-2026 వేలంలో గంగూలీ త‌న మార్క్‌ను చూపించాడు. అత్య‌ధిక ప‌ర్స్ వాల్యూతో వేలంలోకి వ‌చ్చిన ప్రిటోరియా క్యాపిటల్స్.. తొలి ఆట‌గాడిగా సౌతాఫ్రికా స్టార్ స్పిన్న‌ర్ కేశ‌వ్ మహారాజ్‌ను సొంతం చేసుకుంది.

సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ యజమాని కావ్య మారన్‌తో పోటీప‌డి మ‌రి 1.7 మిలియ‌న్ ర్యాండ్లు(సుమారు రూ. 85 లక్షలు)కు మ‌హారాజ్‌ను ప్రిటోరియా ద‌క్కించుకుంది. అత‌డిని సొంతం చేసుకోవ‌డంలో గంగూలీది కీల‌క పాత్ర‌. ఆ త‌ర్వాత సౌతాఫ్రికా టీ20 వేలంలో ప‌ది మిలియ‌న్ ర్యాండ్లు దాటిన మొదటి ఆటగాడిగా నిలిచిన ఐడెన్ మార్‌క్ర‌మ్ కోసం కూడా ప్రిటోరియా తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. కానీ డర్బన్ సూపర్ జెయింట్స్ గ‌ట్టీ పోటీ ఇవ్వ‌డంతో క్యాపిట‌ల్స్ వెన‌క్కి త‌గ్గింది. మార్‌క్ర‌మ్‌ను డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ రికార్డు స్థాయిలో రూ. 7 కోట్లకు  కొనుగోలు చేసింది.

క్యాపిటల్స్‌లోకి బ్రెవిస్‌..
ఇక మార్‌క్ర‌మ్‌ను ద‌క్కించుకోవ‌డంలో విఫ‌ల‌మైన సౌర‌వ్ గంగూలీ.. సౌతాఫ్రికా సూప‌ర్ స్టార్ డెవాల్డ్ బ్రెవిస్‌ను మాత్రం ఆఖ‌రివ‌ర‌కు పోటీప‌డి మ‌రి త‌మ జ‌ట్టులోకి తీసుకొచ్చాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌ అతడి కోసం ఏకంగా రూ. 8.3 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. 

దీంతో ఎస్ఎ టీ20 లీగ్‌ హిస్టరీలోనే అత్యంత ఖ‌రీదైన ప్లేయర్‌గా 22 ఏళ్ల బ్రెవిస్ నిలిచాడు. బ్రెవిస్ కోసం జోబ‌ర్గ్ సూప‌ర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్ కూడా ఆఖ‌రి వ‌ర‌కు ప్ర‌య‌త్నించాడు. కానీ ప్రిటోరియా క్యాపిట‌ల్స్ మాత్రం ఎక్క‌డ వెన‌క్కి త‌గ్గ‌లేదు. అదేవిధంగా గంగూలీ అండ్ కో ప్రోటీస్ స్టార్ ఫాస్ట్ బౌల‌ర్ లుంగి ఎంగిడీని సైతం సొంతం చేసుకున్నారు. 

కాగా ప్రిటోరియా క్యాపిట‌ల్స్ ఐపీఎల్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ సిస్ట‌ర్ ఫ్రాంచైజీ కావ‌డం విశేషం. ఈ ఏడాది ఆగ‌స్టులో ప్రిటోరియా క్యాపిట‌ల్స్ హెడ్ కోచ్‌గా గంగూలీ ఎంపికయ్యాడు. గ‌త కొన్ని ఐపీఎల్ సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ మెంటార్‌గా గంగూలీ వ్య‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)