మెరిసిన మార్క్రమ్‌ మామ.. సూపర్‌ ఫామ్‌ కొనసాగిస్తున్న సన్‌రైజర్స్‌ సారధి

Published on Thu, 03/09/2023 - 07:52

జొహనెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికా టీ20 జట్టు కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా విశ్వరూపం ప్రదర్శిస్తున్న మార్క్రమ్‌.. వెస్టిండీస్‌తో బుధవారం మొదలైన రెండో టెస్టులోనూ అదే జోరు కొనసాగించాడు. ఈ మ్యాచ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 311 పరుగులు (తొలి ఇన్నింగ్స్‌) సాధించింది.

మార్క్రమ్‌ (139 బంతుల్లో 96; 17 ఫోర్లు), టోనీ డి జార్జి (155 బంతుల్లో 86; 11 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. మార్క్రమ్‌ 4 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని​ కోల్పోయాడు. తొలి వికెట్‌కు డీన్‌ ఎల్గర్‌ (54 బంతుల్లో 42; 7 ఫోర్లు)తో కలిసి 76 పరుగులు, రెండో వికెట్‌కు టోనీ డి జార్జితో 116 పరుగులు జోడించిన మార్క్రమ్‌.. క్రీజ్‌లో ఉన్నంత సేపు విండీస్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు.

సఫారీ బ్యాటర్లలో బవుమా (28), ర్యాన్‌  రికెల్టన్‌ (22), వియాన్‌ ముల్దర్‌ (12), సైమన్‌ హార్మర్‌ (1) తక్కువ స్కోర్‌కే పరిమితం కాగా, ఆట ముగిసే సమయానికి హెన్రిచ్‌ క్లాసెన్‌ (17), కేశవ్‌ మహారాజ్‌ క్రీజ్‌లో ఉన్నారు. విండీస్‌ బౌలర్లలో గుడకేశ్‌ మోటీ మూడు వికెట్లు, కైల్‌ మేయర్స్‌ రెండు వికెట్లు తీయగా.. అల్జరీ జోసఫ్‌, జేసన్‌ హోల్డర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

కాగా, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ కోసం సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విండీస్‌, టూర్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిధ్య జట్టు చేతిలో 87 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.  
 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)