Breaking News

మార్క్‌రమ్, బాష్‌ మెరుపులు.. పటిష్ట స్థితిలో సౌతాఫ్రికా

Published on Sat, 12/28/2024 - 07:24

సెంచూరియన్‌: పాకిస్తాన్‌తో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పటిష్ట స్థితిలో నిలిచింది. అరంగేట్ర మ్యాచ్‌లో బంతితో 4 వికెట్లు పడగొట్టిన కార్బిన్‌ బాష్‌ (93 బంతుల్లో 81 నాటౌట్‌; 15 ఫోర్లు) బ్యాట్‌తోనూ విజృంభించాడు. లోయర్‌ ఆర్డర్‌ అండతో  పాకిస్తాన్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. అరంగేట్ర మ్యాచ్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా బాష్‌ రికార్డుల్లోకెక్కాడు. 

ఫలితంగా ఓవర్‌నైట్‌ స్కోరు 82/3తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా చివరకు 73.4 ఓవర్లలో 301 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆతిథ్య సఫారీ జట్టుకు 90 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఓపెనర్‌ మార్క్‌రమ్‌ (144 బంతుల్లో 89; 15 ఫోర్లు) 11 పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. 

కెప్టెన్‌ బవుమా (31; 4 ఫోర్లు), బెడింగ్‌హమ్‌ (30; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కైల్‌ వెరిన్‌ (2), మార్కో యాన్సెన్‌ (2) విఫలమయ్యారు. పాకిస్తాన్‌ బౌలర్లలో ఖుర్రమ్‌ షహజాద్, నసీమ్‌ షా చెరో 3 వికెట్లు పడగొట్టారు. 

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాకిస్తాన్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ (28; 4 ఫోర్లు) అయూబ్‌ (28; 6 ఫోర్లు), కమ్రాన్‌ గులామ్‌ (4) అవుట్‌ కాగా... బాబర్‌ ఆజమ్‌ (16 బ్యాటింగ్‌), సౌద్‌ షకీల్‌ (8 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. 

చేతిలో 7 వికెట్లు ఉన్న పాకిస్తాన్‌... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు 2 పరుగులు వెనుకబడి ఉంది. సఫారీ బౌలర్లలో జన్సెన్‌ 2 వికెట్లు తీశాడు.   

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)